కవయిత్రి మొల్ల రచనలు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

కవయిత్రి మొల్ల రచనలు అద్భుతం

Mar 14 2026 7:21 AM | Updated on Mar 14 2026 7:21 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సరళమైన తెలుగు భాషలో మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్లబాంబ అనేక అద్భుత రచనలు చేసి ఖ్యాతిగాంచారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు అశోక్‌చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రవారం మొల్ల జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్‌, కార్యదర్శి రౌతు సూర్యనారాయణ, మట్ట రమణ, కింజరాపు రమేష్‌, సీహెచ్‌.శ్రీదేవి, గంగు కళ్యాణి, ఆర్‌.మహలక్ష్మి, ఆర్‌.సునీత, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement