శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఆంధ్రప్రదేశ్ రెవె న్యూ సర్వీసుల సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ గురువారం వెల్లడించారు. కోడి రామమూర్తి స్టేడియం వేదిక గా జరిగే ఈ క్రీడా ఉత్సవంలో కలెక్టరేట్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస యూనిట్లు పాల్గొంటా యని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, త్రోబాల్, కేరమ్స్, చెస్, షటిల్, మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, షాట్‌ఫుట్, వాకింగ్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహించనున్న ట్లు తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 24 మంది వీఆర్‌వోలకు గ్రేడ్–2 వీఆర్వోలుగా గురువారం పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ లో అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, సంఘం జిల్లా అధ్యక్షుడు డి.రాజేష్‌కుమార్, సహాధ్యక్షుడు అప్పలనాయుడు, సెక్రటరీ బి.రాంజీ, ట్రెజరర్ జి.ఢిల్లేశ్వరరావు పాల్గొన్నారు.
నందిగాం: నౌగాంలో భర్తపై భార్య కత్తితో దాడికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లి సుందరరావు, కర్రెమ్మలకు సుమారు 25 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి కుమారు డు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. సుందరరావు, కర్రెమ్మలకు మనస్పర్థలు రావడంతో ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. సుందరరావు తన తల్లి వద్ద ఉంటూ అప్పుడప్పుడూ తాగి కర్రెమ్మ ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. ఈ క్రమంలో గురువారం తాగి వచ్చి గొడవ పెడుతుండగా భార్య కర్రెమ్మ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి సుందరరావును టెక్కలి జిలా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.


