పోలాకి: మండలంలో తీరప్రాంత గ్రామమైన కొత్త రేవు పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన పలు కుటుంబాలు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరా యి. టీడీపీ మండల కార్యదర్శి బొడ్డేపు కృష్ణారెడ్డి, యువజన విభాగం నాయకుడు గుండాల రవితోపాటు సుమారు వంద మంది వరకు వైఎస్సార్‌సీపీ లో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీరప్రాంత గ్రామాలను పట్టించు కోవటం మానేశారని, కేవలం ఓటు బ్యాంకుగానే తమను చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరందరికీ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తరేవు పంచాయతీలోని వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని పార్టీ నాయకులు అడ్ల శ్రీను, మిత్తన శ్రీను వివరించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ తీరప్రాంత మత్స్యకార గ్రా మాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీఇచ్చారు. జిల్లాలో మత్స్యకారులకు జగన్ హయాంలోనే గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమం లక్ష పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అంధవరపు సూరిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైత న్య, ఎంపీపీ ముద్దాడ భైరాగినాయడు, మాజీ డీసీ సీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


