పలాస: కాశీబుగ్గ కొండివీధికి చెందిన యువతిపై అదే వీధిలో ఉంటున్న గంధం కామేశ్వర రావు కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ 10వ వార్డులోని కొండి వీధిలో కామేశ్వరరావు, యువతి కుటుంబాలు పక్క పక్కనే ఉంటున్నా యి. కామేశ్వరరావు కుమారుడు సాయి.. యువతి మొబైల్ వాట్సాప్‌కు ‘డార్లింగ్’ అంటూ మెసేజ్ పంపించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి కామేశ్వరరావు మరో కుమారుడు గంధం సాగర్ కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతిని వెంట నే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం ఆసుపత్రి కి తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంధం సాయి, సాగర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎచ్చెర్ల : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తు న్న సండ్ర అమరేంద్రనాథ్ ట్రిపుల్ ఐటీ నూతన డైరెక్టర్‌గా గురువారం బాధ్యత లు స్వీకరించారు. ఇంతకుమందు డైరెక్టర్‌గా పనిచేసిన బాలాజీ వల ంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా అమరేంద్రనాథ్ మాట్లాడుతూ విద్యాల యం ప్రగతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్ర మంలో పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వాసు పొల్గొన్నారు.
టెక్కలి: టెక్కలి జగతిమెట్ట సమీపంలో ప్రస్తు తం నిర్మాణం జరుగుతున్న పెట్రోల్ బంక్‌కు ఎదురుగా మరోసారి స్థల వివాదం చోటు చేసుకుంది. స్థలం ప్రభుత్వానికి చెందినదంటూ తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది నేతృత్వంలో గురువారం గోతులు తవ్వేందుకు సిద్ధమయ్యారు. అయితే, అన్ని రకాల అనుమతులతో స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నామని, ఈ స్థలం ప్రభుత్వానిది ఎలా అవుతుందంటూ కొనుగోలుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలా గోతులు తవ్వుతారంటూ నిలదీశారు. దీంతో గోతులు తవ్వడం ఆపేశారు.


