నిర్లక్ష్యం ట్రిపుల్
ట్రిపుల్‌ఐటీలో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నట్లు తీవ్రంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఆర్జీ యూకేటీ అధికారులు ఆరుగురు సభ్యులతో కూడిన ఐసీసీ కమిటీతో మరోసారి వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లో రెండు రోజులు విచారించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై వీరికి నోటీసులు ఇచ్చారు. వర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు బుధవారం, గురువారం కమిటీ సభ్యులు నూజివీడు క్యాంపస్‌కు చెందిన ఈఈఈ, సీఎస్‌ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ల శ్రావణి కనకకుమారి, నాగార్జున దేవీ, కాంట్రాక్ట్ బోధన సిబ్బంది దుర్గాభవానీ, సురేష్‌బాబు, రాజేష్, వేణుగోపాల్‌లు వీరిని విచారించారు. ఈ రెండు రోజులు సేకరించిన వివరాలపై నివేదికను తయారు చేశారు. ఇన్ని నివేదికలు సేకరించాకైనా విద్యార్థులకు న్యాయం చేస్తారన్న స్పష్టత లేదు. ఈ సారి న్యాయం చేయకపోతే ఇక్కడ విద్యార్థులు చదువు కష్టమని అంటున్నారు.


