‘దుర్గాప్రశాంతి జిల్లాకు గర్వకారణం’ | - | Sakshi
Sakshi News home page

‘దుర్గాప్రశాంతి జిల్లాకు గర్వకారణం’

Feb 20 2026 6:29 AM | Updated on Feb 20 2026 6:29 AM

‘దుర్గాప్రశాంతి జిల్లాకు గర్వకారణం’

‘దుర్గాప్రశాంతి జిల్లాకు గర్వకారణం’

శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ సెపక్‌తక్రా పోటీల్లో గేదెల దుర్గాప్రశాంతి బంగారు పతకం సాధించి దేశం, రాష్ట్రంతోపాటు శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని శ్రీకాకుళం జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్‌ చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈనెల 6 నుంచి 10 వరకు జరిగిన 6వ ఏషియన్‌ మహిళల అంతర్జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌–2026 పోటీ ల్లో పాల్గొన్న భారత జట్టుకు గేదెల దుర్గాప్రశాంతి ప్రాతినిధ్యం వహించింది. టోర్నీ ముగించుకుని జిల్లాకు చేరుకున్న దుర్గాప్రశాంతిని గురువారం రాత్రి శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఘనంగా సత్కరించారు. దుర్గాప్రశాంతితోపాటు తల్లిదండ్రులను సన్మానించారు.

రికార్డుల నిర్వహణ ఇలాగేనా..?

గార: రికార్డుల నిర్వహణ ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా అని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. గురువారం మండలంలోని శాలిహుండం కొండపక్కనున్న స్థల పరిశీలన కోసం వచ్చిన జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రికార్డులు గత రెండు రోజులుగా నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ మునగవలస చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.

నేడు హుండీ ఆదాయం లెక్కింపు

జలుమూరు: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవా ల అనంతరం స్వామివారి హుండీ ఆదాయా న్ని శుక్రవారం లెక్కించనున్నామని ఆలయ ఈఓ కె.ఏడు కొండలు గురువారం తెలిపారు. ఆలయ నిబంధనల మేరకు దేవదాయ శాఖ అధికారులు, పాలక మండలి, అర్చకుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నారు.

ఆర్టీసీకి ఆదాయం

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీముఖలింగంలో నిర్వహించిన చక్ర తీర్థ స్నానం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా చేకూరింది. 33 ప్రత్యేక బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నడిపింది. ఈ ప్రత్యేక బ స్సుల ద్వారా రూ.6,88,747 ఆదాయం లభించిందని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌. అప్పలనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement