ప్రశాంతి @ టీమిండియా | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతి @ టీమిండియా

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

ప్రశాంతి @ టీమిండియా

ప్రశాంతి @ టీమిండియా

ప్రశాంతి @ టీమిండియా బ్రహ్మోత్సవాలు ప్రారంభం విధుల్లో చేరిన ఏసీబీ కొత్త డీఎస్పీ

ఇండియా ప్లకార్డుతో దుర్గాప్రశాంతి

కొలంబోలో జరుగుతున్న 6వ ఏషియన్‌ మహిళల అంతర్జాతీయ సెపక్‌తక్రా

చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు జిల్లాకు చెందిన గేదెల

దుర్గాప్రశాంతి ఎంపికై న విషయం

తెలిసిందే. ఈ పోటీలు శనివారం ప్రారంభం కాగా సిక్కోలు ఇండియా జెర్సీ ధరించి

తళుక్కున మెరిసింది. సిక్కోలు ఖ్యాతిని

అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పింది.

– శ్రీకాకుళం న్యూకాలనీ

మందస: వాసుదేవుని బ్రహోత్సవాలు శనివా రం ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపినంబాళ్ల దాసుకూర్మాచార్యులు మాట్లాడుతూ ఈ ఏడాది భక్తులు అధికంగా దర్శనానికి వస్తున్నారని, 9వ తేదీ నుంచి స్వామి అన్నదాన కార్యక్రమాలు ఏర్పా టు చేస్తున్నామని, ప్రతి రోజు స్వామివారి సంకీర్తనలు, సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఒడిశా నుంచి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం వాసుదేవునికి అభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. జీయర్‌ స్వామి అనుగ్రహ భాషణం, శ్రీమన్నారాయణ భక్తి సంఘం(లోహరిబంద) భక్తి సంగీత విభాషనం, శ్రీసప్తస్వరాల సంగీత పాఠశాల(విశాఖపట్నం) సంగీత విభావరి, శ్రీసాయి మెహర్‌ నృత్య కళానికేతన్‌(మందస)నృత్య ప్రదర్శన జరుగుతుంది.

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొత్త డీఎస్పీగా కె.సత్యనారాయణ రావు శనివారం విధుల్లో చేరారు. 1995 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఈయన విజయనగరం పీటీసీలో ఆరున్నరేళ్లు సీఐగా చేశారు. అనంతరం డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది మంగళగిరి డీ జీపీ కార్యాలయంలో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి డీఎస్పీగా తొలిసారి శ్రీకాకుళంలోనే అడుగుపెట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన బీవీ రమణమూర్తి విశాఖకు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement