కర్రీ..నో వర్రీ! | - | Sakshi
Sakshi News home page

కర్రీ..నో వర్రీ!

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

కర్రీ

కర్రీ..నో వర్రీ!

కర్రీ..నో వర్రీ! అందుబాటు ధరల్లో.. పుట్టగొడుగుల్లా.. అన్నం నుంచి నాన్‌వెజ్‌ వరకూ.. రోజుకో స్పెషల్‌..

జీవనోపాధికి దోహదం..

ఇంటి వంటకు టాటా..!

కర్రీ పాయింట్ల వైపు మొగ్గుతున్న జనం

వాడవాడలా వెలుస్తున్న షాపులు

కొత్త రుచులు, తక్కువ ధరలతో

ఆకర్షిస్తున్న నిర్వాహకులు

జీవనోపాధిగా..

ఊరి నుంచి చుట్టాలు వచ్చారు. మీరు వచ్చేటప్పుడు కర్రీ, సాంబారు తెచ్చేయండి. నేను రైస్‌ పెట్టేస్తా.. ఒంట్లో నలతగా ఉంది. వంట చేయలేదు. వచ్చేటప్పుడు కూరలు, పులిహోరా తెచ్చేయండి.. ఇవీ పట్టణాల్లో చాలామంది గృహిణుల నుంచి వినిపిస్తున్న మాటలు. అన్నం మాత్రమే ఇంట్లో వండుతున్నారు. కూరలన్నీ కర్రీ పాయింట్లు నుంచి తెచ్చుకుంటున్నారు.

కర్రీ పాయింట్లు అందు బాటులో ఉంటున్నాయి. రుచి కూడా బాగుంటుంది. సడన్‌గా కూరలు అవసరం కర్రీ పాయింట్లనే ఆశ్రయిస్తున్నాం. రూ.20 పెడితే కావాల్సిన కూర లభిస్తోంది. వీటికి బ్యాచిలర్స్‌, ఉద్యోగుల ఆదరణ ఎక్కువగా ఉంటోంది.

– పాగోటి జానకిరాం, మారుతీనగర్‌,

నరసన్నపేట

నరసన్నపేట:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉరుకులు పరుగుల జీవనమే. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో కొత్తకొత్త ట్రెండ్స్‌ నడుస్తున్నాయి. గతంతో బ్యాచ్‌లర్స్‌, ఉద్యోగులు, విద్యార్థులు మాత్రమే కర్రీ పాయింట్లను ఆశ్రయించే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా పట్టణంలో చాలావరకు భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే తప్ప జీవనం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట పనులకు టాటా చెబుతున్నారు. కర్రీ పాయింట్ల బాట పడుతున్నారు.

కర్రీ పాయింట్లు ఇప్పుడు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెండేళ్ల క్రితం నరసన్నపేటలో రెండు మూడు కర్రీ పాయింట్లు హోటల్స్‌ వద్ద ఉండేవి. ఇప్పుడు దాదాపు ప్రతి వీధిలోనూ ఆనుకొని 20కి పైగా పాయింట్లు వెలిశాయి. ఇదే పరిస్థితి జిల్లాలోని ప్రధాన పట్టణాలైన శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట తదితర ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది.

కర్రీ పాయింట్లలో అన్నం, పులిహోరా, ఇగురు, ఫ్రై కూరలు, పప్పు, సాంబారు, రసం, పెరుగుతో పాటు నాన్‌ వెజ్‌ కూరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో లభిస్తున్నాయి. శాకాహార కూరలు రూ.20కే లభిస్తున్నాయి. రూ.50 వెచ్చిస్తే ఓ వ్యక్తి సంతృప్తిగా భోజనం చేయగలుగుతున్నారు. గుత్తు వంకయకూర, నాన్‌ వెజ్‌ కూరలు బాగా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన కూరగాయల ధరలు తమకు అనుకూలంగా మారుతున్నాయని చెబుతున్నారు.

కర్రీ పాయింట్లలో నిర్వాహకులు రోజుకో స్పెషల్‌ వైరెటీని ప్రజలకు అందిస్తున్నారు. దీంతో వాటికి ఆదరణ పెరుగుతుంది. కర్రీ పాయింట్లకు వచ్చే వారు ఈ రోజు స్పెషల్‌ ఏమిటి అని అడిగి మరీ తీసుకెళ్తున్నారు. వీటిలో నాన్‌ వెజ్‌ కూరలకే అధిక ప్రాధాన్యత. సోమ, శని వరాల్లో తప్ప మిగిలిన వారాల్లో నాన్‌ వెజ్‌ కూరలు బాగా అమ్ముడవుతున్నాయి. ఎగ్‌ కర్రీకి డిమాండ్‌ ఎక్కువ.

హోటళ్లలో పనిచేసే అనుభవం ఉన్న వారే కాకుండా సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశం ఉన్న వారు తక్కువ పెట్టుబడితో కర్రీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. నరసన్నపేటలో ఇళ్లల్లో, కేటరింగ్‌కు ఆహారం సరఫరా చేసేవారు కూరలు వండి ఇస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు కష్టపడితే గిట్టుబాటుగానే ఉంటోందని నిర్వాహకులు అంటున్నారు. ఒక్క నరసన్నపేటలోనే 45 మంది ఈ కర్రీ పాయింట్లతో జీవనోపాది పొందుతున్నారు.

కాలేజీ రోడ్డులో పిల్లర్స్‌ నిర్మాణం కోసం ఐరన్‌ బాక్సులు అద్దెకు ఇస్తుంటా ను. ఈ పని ఉదయం, సాయంత్రమే ఉంటుంది. మధ్యాహ్నం సమ యంలో కూరలు తీసుకొని వచ్చి కర్రీ పాయింట్‌లో విక్రయాలు చేస్తున్నాను. ఇది కూడా జీవనోపాధిగా ఉంది.

– ఎస్‌.మహేష్‌, కాలేజీ రోడ్డు, నరసన్నపేట

కర్రీ..నో వర్రీ! 1
1/4

కర్రీ..నో వర్రీ!

కర్రీ..నో వర్రీ! 2
2/4

కర్రీ..నో వర్రీ!

కర్రీ..నో వర్రీ! 3
3/4

కర్రీ..నో వర్రీ!

కర్రీ..నో వర్రీ! 4
4/4

కర్రీ..నో వర్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement