పదిలో ‘వంద’ సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పదిలో ‘వంద’ సాధించాలి

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

పదిలో ‘వంద’ సాధించాలి

పదిలో ‘వంద’ సాధించాలి

పదిలో ‘వంద’ సాధించాలి

హెచ్‌ఎంల సమీక్షలో కలెక్టర్‌

స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయు లు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్‌ టెస్టుల ఫలితాల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జి ల్లా 82 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకుందని, కానీ పొరు గు జిల్లా పార్వతీపురం 92 శాతంతో ముందుందని గుర్తు చేశారు. ఈసారి ఏమాత్రం వంద శాతం ఫలితా లే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ స్వల్ప కాలాన్ని అత్యంత కీలకంగా భావించాల ని సూచించారు. విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ‘షైనింగ్‌ స్టార్స్‌’, ‘రైజింగ్‌ స్టార్స్‌’గా సన్నద్ధం చేస్తున్నామని చెప్పా రు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పదో తరగతి ఫలితాల నుంచే ప్రారంభమవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబా బు, సమగ్ర శిక్ష పీఓ వేణుగోపాలరావు, సోష ల్‌ వెల్ఫేర్‌ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ యశోదలక్ష్మి, డిప్యూటీ డీఈఓ ఆర్‌.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement