చోరీకి విఫలయత్నం
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీలో రామతీర్థాలు మార్గంలో డాక్టర్ ఎం.నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో బుల్లెట్ బైక్ చోరీకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశాలు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోనికి చొరబడ్డారు. బైక్ లాక్ రాకపోవడంతో వైర్లు తెంచేసి, సైడ్ డోర్లు పగలుకొట్టి చిందరవందరగా పడేశారు. ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయని గుర్తించి వాటిని ధ్వంసం చేసి పరారయ్యారు. చోరీ యత్నం జరిగినట్లు శనివారం ఉదయం గుర్తించిన బాధితులు జే.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


