శ్రీకాకుళం
న్యూస్‌రీల్
కల్తీ కనిపెట్టగలరా..?
ఆదాయమే లక్ష్యం..
కబ్జా యత్నాలను అడ్డుకున్న అరసవల్లి వాసులు
కర్రీ.. నో వర్రీకర్రీ పాయింట్లు పెరుగుతున్నాయి. ఇదో ఉపాధిగా మారింది. –8లో
నరసన్నపేట: వైఎస్సార్‌సీపీ గ్రామ కార్యకర్తలను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా పార్టీ అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఈ నెల 15వ తేదీలోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు గ్రా మాల్లో గ్రామ కమిటీలను డిజిటలైజేషన్ చేయడంలో కార్యకర్తలు నిమగ్నమయ్యారని, కొన్ని చోట్ల పూర్తయ్యాయని మిగిలిన చోట్ల జాప్యం చేయకుండా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు 15 నాటికి పూర్తి చేయలన్నారు. గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల పేర్లు 5 నుంచి 10 వరకూ ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. కనీసం ఒక్కో గ్రామం నుంచి 10 మందికి త క్కువ లేకుండా డిజిటలైజేషన్ చేయాలన్నారు. మహిళా, ఎస్సీసెల్, బీసీ సెల్, రైతు విభాగం, సోషల్‌మీడియా, విద్యార్థి విభాగం, యువజన విభాగం, గ్రామ బూత్ కమిటీల నుంచి కనీసం 5 నుంచి 9 మంది సభ్యులను ఆన్‌లైన్ చేయాలన్నారు. మండల అనుబంధ కమిటీలకు ప్రతి గ్రామం నుంచి 18 పేర్లు గ్రామ శాఖ అధ్యక్షులు తీసుకొని మండల పార్టీ అధ్యక్షులకు అందించాలని సూచించారు. డిజిటలైజేషన్ చేసేటప్పుడు విధిగా పేరు, తండ్రి పేరు, ఓటర్ ఐడీ, ఫొటో, ఫోన్ నంబర్ ఉండాలన్నారు. వీరికి పార్టీ నుంచి ఐడీ కార్డు వస్తుందని ఇన్స్యూరెన్స్ అమలు చేసే విధానం కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు బాధ్యత తీసుకొని సకాలంలో పూర్తి చేయించాలన్నారు.
హిరమండలం: ఒడిశా రాష్ట్రం హడ్డు బంగి నుంచి ఎచ్చెర్ల మండలానికి అక్రమంగా తరలిస్తున్న ఒడిశా యూరియాను విజిలెన్స్ ఎస్‌ఐ బి. రా మారావు, వ్యవసాయాధికారి బి.సంధ్య పట్టుకున్నారు. శనివారం హిరమండలం మండల కేంద్రంలోని సుభలయ సమీపంలో యూరియాతో వస్తున్న బొలేరో వాహనం పట్టుకున్నా రు. 60 బస్తాలు (45 కేజీలు), వాటి విలువ రూ.1,30,527 ఉంటుందన్నారు. ఎరువులు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, అరుణసాయి ఎరువు షాపు వద్ద ఉంచినట్లు ఏఓ తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. పన్ను చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని తెలిపారు. కాంట్రాక్టర్ల జీఎస్‌టీ చెల్లింపులు, బకాయిల రికవరీపై ప్రత్యేక దష్టి పెట్టాలని, బ్యాంకులు తమ వద్ద ఉన్న అటాచ్‌మెంట్ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం క్రైమ్ :
ఓ వైపు మందుబాబుల జేబులు గుల్ల అవుతుంటే.. మరోవైపు అధికార పార్టీ నాయకుల గల్లా పెట్టె లు కళకళలాడుతున్నాయి. మద్యం మహమ్మారి పట్టి సామాన్యుల కుటుంబాలు ధ్వంసమవుతుంటే.. అదే మద్యం దుకాణాలు పెట్టుకున్న ‘పెద్దల’ బ్యాంకు బ్యాలెన్సులు తెగ పెరుగుతున్నాయి. మద్యం ప్రభుత్వంతో పాటు నాయకులకూ ప్రధాన ఆదాయ మార్గంగా మారిపోయింది. అధికారికంగా దక్కించుకున్న దుకాణాలతో పాటు దానికి అనుబంధంగా బెల్టుషాపులను కూడా వారే ఏర్పాటు చేసుకుని మద్యం సరఫరా చేస్తుండడంతో ఊళ్లకు ఊళ్లు మత్తులో జోగుతున్నాయి. జిల్లాలో ఎచ్చెర్ల డిపో నుంచి 40 వాహనాల్లో రోజుకు సరాసరిన 5 వేల నుంచి 6 వేలకు పైగా లిక్కర్ కేసులు దుకాణాలకు, బార్లకు సర్దుబాటు చేస్తుండటం, రూ.2.50 కోట్ల నుంచి రూ.3. 50 కోట్ల సరాసరిన అమ్మకాలు సాగుతుండటం విశేషం. జిల్లాలో అధికారికంగా 176 దుకాణాలు ప్రైవేటు లైసెన్సుదారులు దక్కించుకు ని నడుపుతుండగా వీరికి లింకుగా 2500కు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఊరూరా దర్జాగా బెల్టుషాపులు నడుస్తుంటే సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తూ ‘పచ్చ’ నోట్ల మామూళ్లను సర్దేసుకుంటున్నారు. నిఘా వేసి పట్టాల్సిన ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్క్వాడ్ బృందాలు మిన్నకుండిపోవడంతో బెల్టుషాపులవారు ఇష్టారా జ్యంగా తాము చెప్పే రేటుకే మద్యం అన్న చందంగా రెచ్చిపోతున్నారు.
తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు ఏడాదిన్నర పాలన కాకముందే ఎమ్మార్పీపై అదనంగా బాదేశారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో పాత స్టాకుపై ఉన్న పాత ఎంఆర్పీ స్టిక్కర్‌పై అదనంగా వసూలు చేశారు.
కొత్త స్టిక్కర్ అంటించినా కూడా అలవాటులో పొరపాటన్న చందంగా కొన్ని ప్రాంతాల్లో పిండేస్తున్నారు. వాస్తవానికి బీర్లు, బ్రీజర్‌లు, వైన్‌పై ఎమ్మార్పీ రేటు పెరగకపోయినా వాటిపై కూడా అదనంగా వడ్డించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో దాదాపు 1091 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ జనాభాను బట్టి 2 నుంచి 3 బెల్టుషాపులు అక్కడి టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే వీధికొక బెల్టుషాపున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. షాపు దూరాన్ని బట్టి ఎమ్మార్పీపై రూ.20 నుంచి రూ.50ల వరకు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే రూ. 70ల వరకు పిండేస్తున్నారు. ఇక ప్రముఖ దినాలు, పండగ రోజులైతే మరింత అదనం.
లైసెన్స్ దుకాణదారుల్లో చోటా మోటా పచ్చనేతలే అధికంగా ఉండటం, ఓ సిండికేట్‌గా ఏర్పడి ఏరి యా, ఏరియాలుగా పంచుకుని బెల్టుషాపులు నడిపిస్తుండటం విశేషం. మద్యం దుకాణాల వద్దకు వచ్చి బెల్టు నడిపేవారు తీసుకుంటే బాటిల్‌పై రూ.10 లు అదనంగా తీసుకోవడం, లేదంటే వారే డైరెక్టుగా బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తే రూ. 20 లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గంలో అయితే ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఇ లానే సరఫరా చేస్తున్నారు.
కాశీబుగ్గలోని ఒక వైన్ షాపులో సిటింగ్ రూమ్
కాశీబుగ్గ రామాలయం ఎదురుగా వైన్ షాపు
అరసవల్లి:
అరసవల్లిలో నగర పరిధి లేఅవుట్స్ రిజర్వ్ స్థలాలపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఈ స్థలాలను అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో కబ్జాలకు గురయ్యే పరిస్థితికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే, కేంద్రమంత్రి అనుచరుడిగా చెలామణి అవుతున్న స్థానిక టీడీపీ నేత ఒకరు ఈ కబ్జా యత్నాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో అరసవల్లి వాసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాలను పంపించి..ఎలాగైనా మన భూములను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. దీంతో శనివా రం స్థానికులంతా సంబంధిత కబ్జాకు గురవుతున్న స్థలాలను పరిశీలించి, అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేస్తున్న పని వారిని స్థానికులు అడ్డుకుని, ఈ విషయాన్ని నేరుగా ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కార్పొరేషన్ అధికారులకు కూడా తెలియజేసేలా చేస్తామంటూ స్థానికులు ప్రకటించారు. వాస్తవానికి అర్బన్ హెల్త్ సెంటర్‌కు పక్కనున్న ఈ విలువైన రిజర్వ్ స్థలాలను రథసప్తమి రాష్ట్ర పండుగ మహోత్సవాల పేరిట శుభ్రపరిచి, పార్కింగ్ తదితర అవసరాల దృష్ట్యా సిద్ధం చేశారు. రథసప్తమి పండుగ అనంతరం రిజర్వ్ స్థలాల్లో ఫెన్సింగ్ పోల్స్ వేసేలా అడుగులు పడ్డాయి. దీంతో ప్రస్తుతానికి దాదాపుగా రెండు స్థలాలకు ఫెన్సింగ్ పనులు పూర్తికాగా, మరో 15 సెంట్ల స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులంతా ఒక్కటై పనులను అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికై నా కార్పొరేషన్ అధికారులు స్పందించి అరసవల్లి రిజర్వ్ స్థలాలను, కల్లాలుగా వినియోగించిన ప్రభుత్వ రెవెన్యూ స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అరసవల్లి ప్రాంతంలో ఎక్కడా సెంటు భూమి కూడా కబ్జాలకు, గానీ ఆక్రమణలకు గానీ గురికాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక నేతలు కొందరు పెద్దల పేరుతో ఆలయానికి చెందిన భూములను, ప్రభుత్వ భూములను, రిజర్వ్ స్థలాలను ఆక్రమించేందుకు దిగుతున్నారంటూ స్థానికంగా చర్చ జోరందుకుంది.
పూల దండలు వేసి స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు
గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ చాటి డీఎస్పీగా కొలువు సాధించిన పైల సుందరరావును రావువలస గ్రామస్తులు శనివారం ఘనంగా సత్కరించారు. జాతీయ రహదారి నుంచి తమ గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ముందుగా గుండవల్లిపేట వద్దకు సుందరరావు వచ్చిన వెంటనే గ్రామస్తులు పూల దండలు వేసి స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా సుందరరావు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. అనంతరం గ్రామం వరకూ రెండు కిలోమీటర్లు ఊరేగింపుగా తీసుకెళ్లి స్కూల్ ఆవరణలో సత్కరించారు. అలాగే ఇటీవల డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న ముద్దాడ రమ్య, పల్లి సాయికుమారిలను కూడా గ్రామస్తులు సత్కరించారు.
–నరసన్నపేట
ఫెన్సింగ్ పోల్స్ వేసి ఆక్రమించిన స్థలమిదే...
ఇటీవల సారవకోటలో కల్తీ లిక్కర్‌తో టీడీపీ నేతే పట్టుబడటంతో మరికొన్ని ఏఓబీ సమీప ప్రాంతాల్లో కల్తీ జరుగుతున్నా సంబంధిత శాఖ వాళ్లు కనిపెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. కవిటి మండలంలో కొన్ని షాపుల్లో మద్యంలో తేడా కనిపిస్తుందంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
మద్యం ఆదాయం రుచి మరిగిన కూటమి ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను టార్గెట్ పెట్టి మరీ జిల్లాలో బార్లు పెట్టించింది. జిల్లాలో 19 బార్లకు దాదాపు 4 సార్లు నోటిఫికేషన్ ఇవ్వడమే కాక చివరి సారి చాలా గోప్యంగా సుమారు 10 బార్లను పచ్చ నేతలకు డ్రాలో కట్టబెట్టింది. వీరిలో అధికంగా షాపులు దక్కించుకున్నవారే బార్లు పెట్టాలంటూ హుకుం జారీ చేయడం విశేషం.
పలాస: పలాస ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలాస కాశీబుగ్గ, పలాస మండలం, వజ్రపుకొ త్తూరు మండలాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బడి, గుడి అన్న తేడా లేకుండా షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. కాశీబుగ్గ పాత జాతీయ రహదారి పక్కన నిత్యం భక్తుల రద్దీతో ఉన్న శ్రీరామాలయం, షిర్డీసాయి దేవాలయాలకు అతి సమీపంలో అతి దగ్గరలో రెండు మద్యం షాపులు నడుస్తున్నాయి. ఇందులో ఒక షాపు అయితే ఉదయం 6గంటలకే తెరుచుకొని బెల్టు షాపు అవతారమెత్తుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతి సమీపంలో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఉదయం రైళ్లు దిగిన ప్రయాణాకుల కోసం ఈ విధంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఈ ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 7 లైసెన్సు పొందిన మద్యం దుకాణా లు ఉండగా.. వీటిలో సిట్టింగ్ రూమ్‌లను కూడా అధికార పార్టీ అండతో ఏర్పాటు చేసుకుని బార్లను నడిపిస్తున్నారు. ఇక వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు, బెండి, అక్కుపల్లి, నువ్వలరేవు, మంచినీళ్లపేట, పూండి ఉద్దానంలోని అనేక గ్రా మాల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. మందస మండలం ఉద్దానం ప్రాంతంలోని భేతాళపురం, లోహరబంద, సువర్ణపురం, మహాదేవుపురం, కొండలోగాం, భైరిసారంగిపురం, అలాగే పలాస మండలంలో అల్లుకోల, లొద్దబద్ర, రెంటికోట, తర్లాకోట, గరుడఖండి, పలాస,మందస ఉద్దానం ప్రాంతంలోని అనేక గ్రామాల్లో బెల్టు షాపులు రాత్రి పగలు అని తేడా లేకుండా సిండికేట్ ఆదేశాలతో నడుస్తున్నాయి. ఒక సీసాపై అక్కడ డిమాండ్ బట్టి రూ.30ల నుంచి రూ.50లకు వరకు అదనంగా విక్రయిస్తున్నారు.
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం


