రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేసే ఆలోచన లేదు
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తి వేసే ఆలోచన లేదని రైల్వే డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే కౌంటర్ పై శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు కౌంటర్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పనివేళలను కుదించామని పేర్కొన్నారు. కౌంటర్‌ను మూసివేసే ఆలోచన మాత్రం లేదని, ఈ కౌంటర్ వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపయోగం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.
ఐదు ఎకరాల గడ్డికుప్పలు దగ్ధం
మందస: పింపిడియా గ్రామంలో శుక్రవారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సమారు ఐదు ఎకరాలకు చెందిన గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు బడ్డి హరికృష్ణ, గండిటి భానమ్మ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.
పలాసలో అదృశ్యమై.. అనకాపల్లిలో ప్రత్యక్షమై..
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన చిన్నారి అజ్జి అనిల్‌కుమార్ పలాసలో అదృశ్యమై అనకాపల్లి జిల్లా కోటపాడు పోలీసులకు దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అనిల్‌కుమార్ శుక్రవారం కోటపాడు పరిసర ప్రాంతంలో బేల చూపులతో తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. తనది కాశీబుగ్గ అని, తండ్రి పేరు విఠల్‌రావు చెప్పడంతో బాలుడిని సురక్షితంగా పోలీసుస్టేషన్‌కి తీసుకొచ్చారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు తెలిసిన వారు 9492894881 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు సూచించారు.
మద్యం అక్రమ రవాణాపై నిఘా
ఇచ్ఛాపురం/సోంపేట: ఒడిశా నుంచి ఆంధ్రాలోకి మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పురుషోత్తపురం చెక్‌పోస్టు, ఇచ్ఛాపురం, సోంపేట ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లను పరిశీలించారు.
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేసే ఆలోచన లేదు
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేసే ఆలోచన లేదు


