కేజీబీవీలో చర్మవ్యాధుల విజృంభణ
పోలాకి: మండలంలోని గంగివలస కేజీబీవీలో చర్మవ్యాధులు విజృంభించి బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల బాలికలు ఇన్‌ఫెక్షన్‌తో ఎక్కువగా బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల సంక్రాంతి సెలవుల నేపథ్యంలో బాలికలు సొంతింటికి వెళ్లటంతో విషయం బయటపడింది. కేజీబీవీ సిబ్బంది పట్టించుకోపోవటం వల్లనే తమ పిల్లలకు ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం కేజీబీవీ ఎస్‌ఓ శారద వద్ద ప్రస్తావించగా సంక్రాంతి ముందు ఇన్‌ఫెక్షన్ ఉన్న మాట వాస్తవమేనని, వైద్య సేవలు సైతం అందించామని చెప్పారు. అయితే పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పర్యవేక్షణ లోపం బాలికలకు శాపంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.


