ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలి మెట్టవీధికి చెందిన ఏదూరి వీరన్న(50) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వీరన్న గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని కుటుంబ సభ్యులను అడగ్గా.. ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత కుటుంబసభ్యులు గుర్తించి తాడుకు వేలాడుతున్న వీరన్నను కిందకు దించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వీరన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టెక్కలి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


