● తీరప్రాంతం నుంచి జాతీయ స్థాయికి..
డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన దున్న మీనా ఖోఖో గేమ్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 2023–24లో చిత్తూరు జిల్లాలో జరిగిన అండర్–14 బాలికల ఖోఖో పోటీల్లో శ్రీకాకుళం జట్టుకు ప్రాతినిధ్యం వహించి రజత పతకం సాధించింది. 38వ రాష్ట్రస్థాయి అండర్ –14 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా నరసారావుపేటలో జరిగిన ఖోఖోపోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. 2024–25లో పల్నాడు జిల్లా వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో రజతం, మహారాష్ట్ర కొల్హంపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని బంగారు పతకాలను పొందింది. ప్రస్తుతం డొంకూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మీనా రైల్వే ఉద్యోగిగా స్థిరపడాలనేదే తన లక్ష్యమని చెబుతోంది.


