ఉత్సాహంగా కబడ్డీ పోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో రథసప్తమి క్రీడా ఉత్సవ్ పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 జట్లు ప్రాతినిధ్యం వహించాయి. తొలిరోజు లీగ్‌దశ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ పోటీలు జరగనున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్, సంగిడీలు, ఉలవల బస్తాల లిఫ్టింగ్, కర్రసాము వంటి పలు గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు పర్యవేక్షించారు. ఒలింపిక్ అసోసియేషన్, పీడీ, పీఈటీ సంఘ ప్రతినిధులు, పీడీలు, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


