● అనుశ్రీ నాట్యం అమోఘం!
ఇచ్ఛాపురం మండలం అరకబద్ర గ్రామానికి చెందిన బింగి అనుశ్రీ పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా నృత్య ప్రదర్శనలో అసమాన ప్రతిభ కనబర్చుతూ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతోంది. ఇచ్ఛాపురం కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న అనుశ్రీ స్థానిక స్వేచ్ఛా నృత్య తరంగణి నృత్యాలయంలో కూచిపూడి, భరత నాట్యం, జానపద నాట్యాలలో శిక్షణ తీసుకుంటోంది. 2023లో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం వద్ద ప్రదర్శన నిర్వహించి ఆహూతుల్ని అలరించింది. 2024 జనవరి 26న హైదరాబాద్‌లో నిర్వహించిన సాంస్కృతిక కళారాధనలో ఇచ్చిన ప్రదర్శనకు ‘అభినయతార’ అవార్డుతో నిర్వాహకులు సత్కరించారు. గత ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన నృత్య పోటీల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నటులు జెమినీ సురేష్, డాక్టర్ కల్యాణ్ శాసీ్త్ర చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకుంది. గత ఏడాది మే 5న కాశీలో వాగ్దేవి వాయిద్య విద్య సంగీత కళా నృత్య సాంస్కృతిక సమితిలో ఇచ్చిన నృత్యాభినయానికి ముగ్ధులైన నిర్వాహకులు ‘శివనంది’ అవార్డును అందించారు. గత ఏడాది జూలై 24న తెలంగాణ రాష్ట్రం బోనాల సంబరాలు సందర్భంగా నిర్వహించిన నృత్య పోటీల్లో పాల్గొని ‘నాట్య మయూరి’ అవార్డును కై వసం చేసుకుంది. గత ఏడాది ఆగస్టు 10న విశాఖపట్నంలో జరిగిన ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ పోటీల్లో పాల్గొని ‘నటరాజా’ పురష్కారాన్ని పొందింది. తండ్రి బింగి నీలాద్రి రేషన్ షాపు డీలర్‌గా పనిచేస్తుండగా, తల్లి కుమారీ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
నృత్య ప్రదర్శన చేస్తున్న అనుశ్రీ
● అనుశ్రీ నాట్యం అమోఘం!


