చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
టెక్కలి : పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోత చిన్నబాబు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోత రవి మంగళవారం పరామర్శించారు. చిన్నబాబు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పుస్తెలతాడు చోరీ
రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో కలిశెట్టి సూరమ్మకు చెందిన రెండు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. లావేరు పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జిపురం హైస్కూల్ వెనుక రొంపివలసకు వెళ్లే దారిలో పొలం నుంచి సూరమ్మ అనే వృద్ధురాలు వస్తుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చిన పుస్తెలతాడు లాగారు. వెంటనే తేరుకుని తాడు పట్టుకోవడంతో సగం ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది. దీంతో మరో సగం తాడు పట్టుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటుకల ట్రాక్టర్ బోల్తా
మందస: మేఘమాల గ్రామ సమీపంలో మంగళవారం ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడింది. మందస నుంచి చీపి గ్రామం ఇటుకల లోడుతో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొగమంచుకు తోడు కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం తప్పింది.
గురుకుల విద్యార్థి ప్రతిభ
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పొట్నూరు ప్రవీణ్‌కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్‌హెచ్‌ఆర్‌ఈఎస్‌టీఏ–ఎన్‌ఈటీఎస్–2026 పరీక్షలో ఆల్ ఇండియాలో 725వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జోన్–1 స్కూల్స్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌గా నమోదైందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆప్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో పేద దళిత విద్యార్థులకు అత్యుత్తమ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో కార్పొట్ సంస్థల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో విజయం సాధించిన విద్యార్థితో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ అభినందించారు.
రణస్థలం : లావేరు మండలం రావివలస సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి చిలకపాలెం మీదుగా రాయ్‌పూర్ వైపు వెళుతున్న లారీ మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలోని బొగ్గు రోడ్డు పక్కన కళ్లద్దాలు, హెల్మెట్ దుకాణంపై పడటంతో సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో రణస్థలం మండలం ఎన్‌జీఆర్‌పురం పంచాయతీ చీకటిపేటకు చెందిన కళ్లజోడు దుకాణ నిర్వాహకురాలు కొమర లక్ష్మీ సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. పోలీసులు లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ చక్కదిద్దారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ


