గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నం
బూర్జ: పెట్రోల్ బంకు ఓనర్ బంకులో పనిచేయకుండా వెళ్లిపోమని గెంటివేసినందుకు మనస్థాపం చెందిన యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మండలంలోని కొల్లివలస జంక్షన్ వద్దనున్న ఒక బంక్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లివలస జంక్షన్‌లో ఉన్న పెట్రోల్ బంకులో సరుబుజ్జిలి మండలంలోని తురకపేట గ్రామ కాలనీకి చెందిన కోరాడ వెంకటేష్ గత 4 నెలలుగా పంపు ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలో ఉంటున్న బంకు యజమాని ఇప్పిలి రవికి కాల్‌చేసి తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, లేకపోతే చచ్చిపోతానని వెంకటేష్ భయపెట్టాడు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బంకు యజమాని వచ్చి వెంకటేష్‌కు అతను అమ్మకం చేసిన డబ్బులు గురించి అడిగాడు. అందులో రూ.13,800లు సొంతానికి వాడుకున్నట్లు రుజువైంది. దీంతో బంకు యజమాని కోపగించికొని అక్కడ నుంచి వెళ్లిపోమని, బైక్ ఇక్కడ పెట్టి తండ్రిని తీసుకురమ్మని మెడమీద చేయి వేసి గెంటాడు. దీంతో వెంకటేష్ వెంటనే జంక్షన్‌కు వెళ్లి బ్లేడ్ తెచ్చికొని బంకు వద్ద తన పీక మీద, ఎడమచేతి మండపైన కోసుకున్నాడు. దీంతో వెంటనే బంకులో ఉన్న కారులో ఎక్కించుకొని శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాణహాని లేదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు.


