పంటకు పొగ పెడుతోంది
● రైతులను భయపెడుతున్న పొగమంచు
● జీడి,మామిడి పూతకు నష్టం
● అపరాల పంటలదీ ఆదే పరిస్థితి
మంచుతో నష్టం
అపరాల పంటలైన పెసర, మినుము ఆశాజనకంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రస్తు తం పూత దశకు వచ్చాయి. పస్తుతం కురుస్తున్న మంచు కారణంగా పూతకు వచ్చిన పంటంతా నల్లగా మారిపోతోంది. పూత రాలిపోవడంతో పాటు చిన్న దోమ చేరి నష్టం జరుగుతుంది. పంటను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. – కొల్లి కృష్ణారావు, రైతు,
బైరాగిపేట గ్రామం, పాతపట్నం మండలం
పాతపట్నం:
గత పది, పదిహేను రోజులుగా కురుస్తున్న పొగ మంచు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూత దశకు వచ్చిన పంటలు పొగ మంచు కారణంగా మాడిపోతున్నాయి. జీడి,మామిడి పూతతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, పూతకు నష్టం కలుగుతోంది. ఆలస్యంగా పూతకు వచ్చిన కంది పంటదీ అదే పరిస్థితి.
ఉదయం 9 వరకు..
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. సూర్యుడు కనిపించనంతగా దట్టంగా మంచు కురవటంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలి పనులకు వెళ్లేవారు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు మంచుతో పాటు చలి పెరగటంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
పంటకు పొగ పెడుతోంది


