వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
● రైతుల్ని ఆదుకోవడంలో వ్యవసాయ శాఖ
మంత్రి విఫలమయ్యారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
టెక్కలి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా భ్రష్టు పట్టిందని, ముఖ్యంగా జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సా ర్‌సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండగలా మా ర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరగుతోందన్నారు. రాష్ట్రంలో పత్తి, మిరప, టమాటా, ఉల్లి, మామిడి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవని తెలిపారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరల కు ధాన్యం అమ్మకాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అంతే కాకుండా బస్తాకు అదనంగా 3 కిలోల వరకు దోపిడీ చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు.
గత ప్రభుత్వంలో పేద, సామాన్య వర్గాలకు మేలు కలిగే విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని, వాటిని చంద్రబా బు ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఈ నెల 10 లోగా జిల్లా కార్యాలయానికి అందజేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తున్న ‘సాక్షి’ మీడియాపై అక్రమంగా కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అధికా రం శాశ్వతం కాదని, తక్షణమే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే, గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని కృష్ణదాస్ హెచ్చరించారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు హెచ్.వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, అధికార ప్రతినిధి సత్తారు సత్యం, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు యర్ర చక్రవర్తి, టి.కిరణ్, కె.అజయ్, పి.వెంకట్రావు, పి.వైకుంఠరావు, కె.ధర్మారావు, డి.పోలయ్య, బి.రాజేష్ తదితరులు ఉన్నారు.


