ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..?
కొత్తగా వేసిన రోడ్డు. స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేనట్టే కనిపించే పరిస్థితి. స్పీడ్ బ్రేకర్‌కు వేయాల్సిన రంగులు వేయకపోవడంతో వాహనాల డ్రైవర్లు ఇలా అయోమయానికి గురై ప్రమాదాల పాలవుతున్నారు. జిల్లా కేంద్రంలోని విజయ గణపతి ఆలయ సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారు. స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది. కానీ దాన్ని సూచించే రంగులు వేయలేదు. దీంతో దగ్గరకు వచ్చేంత వరకు స్పీడ్ బ్రేకర్ కనిపించడం లేదు. ఆదివారం ఓ ఆటో ఇలాగే ప్రమాదానికి గురైంది. ఒకరు గాయపడగా మిగిలిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
పూర్తిగా బోల్తా పడిన ఆటో
స్పీడ్ బ్రేకర్ దాటాక అదుపు తప్పి బోల్తా పడుతున్న దృశ్యం
స్పీడ్ బ్రేకర్ కనిపించక అదుపు తప్పిన ఆటో
ఆటోలో ఉన్న వారిని బయటకు తీస్తున్న స్థానికులు
ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..?
ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..?
ఎవరి నిర్లక్ష్యానికి ఫలితమిది..?


