చదువుకొనాల్సిందేనా..? | - | Sakshi
Sakshi News home page

చదువుకొనాల్సిందేనా..?

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

చదువుకొనాల్సిందేనా..?

చదువుకొనాల్సిందేనా..?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేదెప్పుడు..?

రూ.205.95 కోట్ల బకాయిలకే దిక్కు లేదు

హామీలన్నీ గాలికే

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పేద విద్యార్థి చదువుకు సాయం చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. సామాన్యుడి ఇంట చదువుల దీపం వెలిగేందుకు సర్కారు దయ చూపడం లేదు. డబ్బులున్న వాడే చదువుకోవాలనే తీరులో చంద్రబాబు ప్రభు త్వం వ్యవహరిస్తోంది. జిల్లాలో ఇప్పటికే చదువుల్లో చేరిన విద్యార్థులు కళాశాలల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. చదువులు పూర్తయిన వారు సైతం సర్టిఫికెట్లు తెచ్చుకోలేక ఉద్యోగ అన్వేషణలో వెనకబడుతున్నారు. ఓట్ల కోసం ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చిన నాయకులు తూతూ మంత్రంగా ఒక విడత నిధులు మాత్రం విడుదల చేసి తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోయారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అటకెక్కి పిల్లలంతా చదువు‘కొనాల్సి’ వస్తుంది.

కనికరించని ప్రభుత్వం

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత చదువులు మృగ్యంగా మా రాయి. ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించాల్సిన ఉపకార వేతనాలు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికే విద్యా సంఘాలు, విద్యార్థులు వినతులు ఇచ్చి ధర్నాలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు.

క్యాలెండర్‌ ప్రకారం..

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏటా క్యాలెండర్‌ ప్రకారం విద్యార్థులకు విద్యా దీవెన అందేది. ఏడాదికి నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. విదేశీ విద్యా పథకం ద్వారా కూడా ఉన్నత చదువులకు సాయం చేసేవారు. అమ్మ ఒడి ఠంచనుగా అందేది. ఇప్పుడా భాగ్యం లేకుండాపోయింది.

బకాయిలు రూ.205.95 కోట్లు

విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోతున్నాయి. గత ఏడాది, అంతకు ముందు ఏడాది బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.99.21 కోట్లు, 2024–25 విద్యా సంవత్సరం మూడు విడతల బకాయిలు రూ.106.74 కోట్లు వెరసి రూ.205 .95 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాలి. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా రూ.33.07 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం, ప్రభుత్వం మారడంతో మూడు విడతలు చెల్లించలేదు. తర్వాతి విద్యా సంవత్సరానికి చెందిన మూడు విడతల డబ్బులను చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలైనా పాత బకాయిల ఊసే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement