ప్రజాస్వామ్యానికి మూలస్తంభం రాజ్యాంగం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం కాదని మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈఈ బి.కరుశ్రీ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పీఎన్‌కాలనీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం ఆత్మపరిశీలన చేసుకునే రోజు అని పేర్కొన్నారు. హక్కులు, విధులు నాణేనికి రెండు దిశలు వంటివని చెప్పారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు.


