పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు కార్గో చిచ్చు పెట్టి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి సాగుతున్న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చీపురపల్లి పంచాయతీ సంతోష్‌నగర్‌లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 21న మహాధర్నా పేరున రైతులతో కలిసి పలాస ఆర్డీఓకి తమ గోడు వినిపించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పాలకులు ఇదే పంథా కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు, బాధితులు పాల్గొన్నారు.
సాగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం రూరల్: పెదపాడు పంచాయతీ ముద్దాడపేటకు చెందిన ముద్దాడ తారకేశ్వరరావు (40) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు


