పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
అరసవల్లి: విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల ను సంబంధిత లైన్ ఇన్‌స్టెక్టర్లు, ఏఈలు బాధ్య తగా పర్యవేక్షించాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో పట్టించుకోకపోవడంపై ఆపరేషన్స్ డివిజినల్ ఈఈ పైడి యోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పొందూరు మండలం సింగూరు..వద్ద 11 కె.వి.విద్యుత్ స్తంభాల ఏర్పా టు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కనీ స లోతు లేకుండానే స్తంభాలను పాతుతున్నట్లుగా గుర్తించి కాంట్రాక్టు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఇంజినీర్లు, లైన్ స్టాఫ్‌కు ఫోన్‌లో మందలించారు.
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీలో డబ్ల్యూఎంఈ చర్చి స్థలంలో సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు. జనవాసాల్లో టవర్ ఏర్పాటు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులు స్పందించి టవర్ పనులు తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్‌గా పప్పల వేణుగోపాలరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన కాకినాడ సమగ్ర శిక్ష ఏపీసీగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో శ్రీకాకుళం జిల్లాలో తహశీల్దార్, మరికొన్ని పోస్టుల్లోనూ పనిచేశారు. పదోన్నతిపై అమరావతికి బదిలీ అవ్వగా అక్కడి నుంచి కాకినాడ ఏపీసీగా నియమితులయ్యారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం ఏపీసీగా బదిలీపై వస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఏపీసీగా పనిచేసిన సంపత్‌రావు శశిభూషణ్‌ను లెక్చరర్‌గా మాతృ శాఖకు పంపించారు.
సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాలు
రణస్థలం: అర్జునవలస రెవెన్యూ పరిధిలోని సంచాం కొండపై గ్రావెల్ తవ్వకాలు గురువారం కూ డా కొనసాగాయి. ఎన్‌హెచ్‌ఏఐ సారథ్యంలో రణస్థ లం పైవంతెన పనులు చేపడుతున్న ఎస్‌ఈపీఎల్ కాంట్రాక్ట్‌కు చెందిన ప్రొక్లెయిన్, ఆరు లారీలతో గురువారం కూడా కూడా గ్రావెల్ తరలింపు ప్రక్రి య కొనసాగింది. అనుమతులు లేకుండా ఎలా తరలిస్తున్నారంటూ సంచాం, అర్జునవలస గ్రామస్తులు ప్రశ్నించడంతో తొలుత కొన్ని గంటలపాటు నిలుపుదల చేశారు. మరలా మధ్యాహ్నం నుంచి గ్రావెల్ తవ్వకాలు జరపడం కొసమెరుపు. ఇటీవల కొండ గ్రావెల్ సమస్యను రాష్ట్ర అసెంబ్లీలోనూ చర్చనీ యాంశమైన విషయం తెలిసిందే. ఈ విషయమై తహశీల్దార్ సనపల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ సంచాం కొండ స్కిల్ డెవలెప్‌మెంట్‌కు ఇచ్చారని, అక్కడ స్థలం లెవెలింగ్ కోసం గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. హైవే వారు కూడా గ్రావెల్ కోసం రూ.7లక్షలు మైన్స్ వాళ్లకు అడ్వాస్ కట్టారని తెలిపారు. మైన్స్ డీడీ మోహనరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని, తాజాగా కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు.
సంతబొమ్మాళి: నౌపడ గ్రామంలోని కచ్చిరుపారం ప్రాంతంలో గుర్తుతెలియని వివాహిత మృతదే హం గురువారం లభ్య మైంది. సుమారు 40 ఏళ్లు వయస్సు కలిగి ముఖం మొత్తం దెబ్బ లు తగిలి పోల్చలేని విధంగా మృతదేహం మారింది. విషయం తెలిసిన వెంటనే నౌపడ ఎస్‌ఐ జి.నారాయణస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై గాయాలు బట్టి హత్య జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.
పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం


