వంశధార తీరం..దేదీప్యమానం
జలుమూరు: బాలియాత్ర ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం వంశధార తీరంలో భక్తులు దీపోత్సవం నిర్వహించారు. కానీ స్థాని క ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి సుమారు గంటన్నరకు పైబడి ఆలస్యంగా రావడంతో భక్తులకు అసహనానికి గురై చాలా మంది వెనుదిరిగారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కా వాల్సి ఉండగా.. ఎమ్మెల్యే ఎంతకూ రాలేదు. దీంతో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కు మార్‌తో అర్చకులు, నిర్వాహకులు కార్యక్రమం మొదలుపెట్టారు. కాసేపటికే ఆయన రావడంతో మళ్లీ యాత్రకు పూర్ణకుంభం సిద్ధం చేసి ప్రా రంభించారు. తర్వాత పూజల అనంతరం బాణసంచా కాల్చి వంశధార నదికి చేరుకున్నారు. దీనికి ముందు బాలి యాత్ర విశేషాలను నిర్వాహక కమిటీ ప్రతినిధి దువ్వాడ జీవితేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామ్మోహనరావు దంపతులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ దాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, విశాఖ సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ కళింగ, వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్లు దుంపల రామారావు(లక్ష్మణరావు), అంధవరపు సూరిబాబు, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ తదితరులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
వంశధార తీరం..దేదీప్యమానం
వంశధార తీరం..దేదీప్యమానం


