
మధ్యాహ్న భోజనం అపహాస్యం
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిగూడ ఆర్‌ఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అపహ స్యం చేసేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏకోపా ధ్యాయ పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది పిల్లలకు పాఠశాల అవరణలో వంట చేయడం లేదు. ఇంటి వద్ద వంట చేసి పాఠశాలకు వంట ఏజెన్సీ సభ్యురాలికి బదులు ఆమె భర్త ప్రతిరోజూ తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డన చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం భోజనా న్ని పాఠశాలలో కేవలం నలుగు విద్యార్థులు మాత్ర మే చేశారు. అయితే నలుగు విద్యార్థులకు కేవలం అన్నం, కూర పెట్టారు తప్ప, చారు మాత్రము తీసుకు రాలేదు. చారులేక పోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన 14 మంది విద్యార్థులు గ్రామంలో జరిగిన అన్నదా న కార్యక్రమానికి హాజరైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల వద్ద గదులు సక్రమంగా లేకపోవడం వలన ఇంటి వద్ద వంట చేయిస్తున్నట్లు చెప్పారు.