దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! | - | Sakshi
Sakshi News home page

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

Oct 19 2025 6:04 AM | Updated on Oct 19 2025 6:04 AM

దీపావ

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! ●ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు ●21 ఏళ్ల క్రితం జిల్లాలో భారీ విషాదం ●జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జాగ్రత్తలు తీసుకోవాలి

విక్రయాలు జరపరాదు

●ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు ●21 ఏళ్ల క్రితం జిల్లాలో భారీ విషాదం ●జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు

శ్రీకాకుళం క్రైమ్‌:

దీపావళి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అయితే దీపావళి ఆనందంగా జరుపుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆస్తి, ప్రాణ నష్టం జరిగి విషాదం మిగులుతుంది. అలాంటి చీకటి రోజును జిల్లా 21 ఏళ్ల క్రితం చూసింది. 2004వ సంవత్సరం నవంబర్‌ 4వ తేదీన జిల్లా కేంద్రంలో చిన బజారులోని ఒక నివాస గృహం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అక్రమ పేలుడు పదార్థాల నిల్వలు పేలడంతో ఘటనా స్థలంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆనాటి ఘటన తలచుకుంటే ఇప్పటికీ జిల్లా ప్రజలకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. పేలుళ్లు జరిగిన మరుసటి రోజు జరిగిన ప్రాంతమంతా క్లీన్‌ చేశారు. ఆ మరుసటి రోజు నిల్వల డంప్‌ అంతా (కాలిపోయినవే అని) డే అండ్‌ నైట్‌ సమీప నాగావళి నది వద్ద పారబోసేందుకు వ్యాన్‌లో వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కడ కూడా ఆ చెత్తలో కొన్ని పేలుడు పదార్థాలు పేలడంతో అక్కడికక్కడే డ్రైవర్‌, క్లీనర్‌, మరో హెల్పర్‌ మృత్యువాత పడ్డారు.

నువ్వలరేవులో సైతం..

వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో దాదాపు 25 ఏళ్ల క్రితం శ్రీరామనవమి ఉత్సవాల్లో బాణాసంచా పేల్చేందుకు కొందరు అక్రమంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వలు ఉంచారు. ప్రమాదవశాత్తు అవి కూడా పేలడంతో అప్పట్లో అధిక సంఖ్యలో మృత్యువాత పడినా.. నలుగురైదుగురే చనిపోయినట్లు రికార్డులకెక్కించారు. మృతదేహాలను సమీప ఇసుక దిబ్బల్లో పాతివేసినట్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్‌ఐ కృష్ణ సస్పెండయ్యారు.

నాణ్యమైన కంపెనీలు తయారు చేసిన బాణసంచాను వినియోగించాలి.

వేగంగా కాలే స్వభావం ఉన్నవి ఇళ్లల్లో నిల్వ ఉంచరాదు.

కిరోసిన్‌, గ్యాస్‌ నిల్వ చేసే గదుల్లో, వంట గదుల్లో బాణసంచా ఉంచరాదు.

చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి.

కాల్చేటప్పుడు పొడుగాటి కర్రకు కాకర్లు, వగైరా కట్టి కాల్చాలి.

చేతిలో గానీ, దగ్గరలో గానీ బాంబులు కాల్చకూడదు.

సగం కాలిన మందుగుండుని నిర్లక్ష్యం చేయరాదు.

బాణసంచా కాల్చేటప్పుడు సమీపంలో నీళ్లు, ఇసుక ఉంచుకోవాలి.

బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలి.

రోగులు, వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులు దూరంగా ఉండాలి.

రాకెట్లు, ఫైర్‌ క్రాకర్లు వంటి క్షిపణులను టిన్‌ బాటిళ్లలో పెట్టి వెలిగించకూడదు.

గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్‌ బంకులకు దూరంగా రాకెట్లను, పటాకులు కాల్చాలి.

అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రం లేదా 101కి ఫోన్‌ ద్వారా సమాచారమివ్వాలి.

తాత్కాలిక షాపులకు లైసెన్సులను ఆయా పరిధి ఆర్డీవోనే అందజేస్తారు. పోలీస్‌, ఫైర్‌, రెవెన్యూ, పంచాయతీ (లేదా) వార్డు అన్ని అనుమతులు అందులోనే ఉంటాయి. క్వాలిటీ అయినవి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి కాల్చి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

– జడ్డు మోహనరావు,

జిల్లా అగ్నిమాపక అధికారి

అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేసినా, నిల్వలు కలిగి ఉన్నా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు. లైసెన్సులు లేకుండా మందుగుండు అమ్మితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే దాడులు చేస్తున్నాం. ఎవరైనా లైసెన్సులు లేకుండా అమ్మినా నేరుగా ప్రజలు సమాచారమివ్వవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహించి ప్రజలు దీపావళి జరుపుకోవాలి.

– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! 1
1/4

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! 2
2/4

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! 3
3/4

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..! 4
4/4

దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement