
గ్రామీణ బ్యాంకు సేవలకు బ్రేక్
సహకరించాలి
● నాలుగు రోజుల పాటు అంతరాయం ● బ్యాంకుల విలీన ప్రక్రియే కారణం ● 13న తిరిగి సేవలు ప్రారంభం
హిరమండలం:
జిల్లాలో ఏపీ గ్రామీణ బ్యాంకు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అన్ని రకాల ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఖాతాదారులకు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే బ్యాంకు అధికారులు తెలియజే శారు. మళ్లీ ఈ నెల 13న ఉదయం 10 గంటలకు సేవలు ప్రారంభంకానున్నాయి. గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ఇందుకు కారణం. కొద్దిరోజు ల కిందట నాలుగో విడత బ్యాంకుల విలీన ప్రక్రి యకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ఆంధప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులన్నీ విలీనం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. 4 గ్రామీణ బ్యాంకు లను విలీనం చేసే ప్రక్రియలో భాగంగానే సాంకేతిక అంశాలను సరిచేసేందుకు సేవలు నిలిపివేసినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏడు జిల్లా ల్లో విస్తరించి ఉంది. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో 278 శాఖలు ఉన్నాయి. మన జిల్లాకు సంబంధించి 80 శాఖలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి ఈ శాఖలన్నీ ఏపీ గ్రామీణ బ్యాంక్‌గా సేవలందించనున్నాయి. మరోవైపు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు సైతం నిలిచిపోయాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవ లు, బ్యాంక్ మిత్ర సేవలు కూడా నిలిచిపోయా యి. దీంతో అత్యవసర పనులు ఉన్న ఖాతాదారు లు అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఏపీజీవీబీల్లో స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజల సేవలు ఉంటాయి. ఇప్పటికే ఖాతాదారులకు బ్యాంకు వర్గాలు సమాచారం ఇచ్చినా, కొందరికి విషయం తెలియక అసౌకర్యానికి గురయ్యారు.
గ్రామీణ బ్యాంకుల్లో సేవలు నిలిపివేతపై ఇప్పటికే ఖాతాదారుల కు సమాచారం ఇచ్చాం. విలీన ప్రక్రియలో భాగంగానే సాంకేతిక అంశాలను సరిచేస్తున్నారు. ఖాతాదారులు ఈ విషయంలో సహకరించాలి. 13న తిరిగి సేవలు ప్రారంభం కానున్నాయి. – పి.వెంకటనారాయణ,
బ్రాంచి మేనేజర్, ఏపీజీబీ, ఎల్‌ఎన్‌పేట

గ్రామీణ బ్యాంకు సేవలకు బ్రేక్