
చినుకు పడితే చెరువే
నిత్యం నరకమే..
● జలమయమవుతున్న రహదారులు ● రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులకు ఇక్కట్లు ● పల్లె నుంచి పట్టణం దాకా ఇదే పరిస్థితి
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: కొద్దిపాటి వర్షమొచ్చినా రహదారులు ముంపునకు గురవుతున్నా యి. రోజుల తరబడి నీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనచోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆమదాలవలస నియోజకవర్గంలో అన్నిచోట్లా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలి క వసతులు కల్పిస్తున్నామని స్టేజీలపై ప్రసంగాలు గుప్పిస్తున్న కూటమి నాయకుల మాటలకు క్షేత్రస్థాయి లో పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఆమదాలవలస పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మురుగు నీరు, వరదనీరు నిలిచిపోతోంది. సీసీ రోడ్లు, కాలువలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. వెంగళరావు కాలనీ, ఐ.జె.నాయు డుకాలనీ, కాలేజీ ఎదురు వీధి, చంద్రయ్యపేట, మెట్టక్కివలస, పూజారిపేట, పారిశ్రామికవాడలో కొన్ని వీధుల్లో సీసీ రహదారులు నిర్మించి కాలువలు నిర్మా ణం చేపట్టకపోవడంతో చినుకుపడితే ఆయా ప్రాంతా లు చిత్తడిగా మారుతున్నాయి. కలివరం గ్రామ మార్కెట్‌కు వెళ్లే రహదారి ఎప్పుడు వర్షం పడినా చెరువును తలపిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రహదారులు నిర్మాణానికి మంజూరైన నిధులతో కొందరు పాలకులు ఇళ్లముందు రహదారులు నిర్మించుకుంటున్నారే పత్ప నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రోడ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ నగర్ ప్రాంతంలో సు మారు 200 కుటుంబాలు నివాసముంటున్నాయి. రైల్వే ట్రాక్ ఇవతల వైపు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ అధికారులు గాని, పాలకులు గాని ముందడుగు వేయడంలేదు. రోడ్లు లేక వర్షం పడితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కొందరు తమ వాహనాలను దూరప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
– జి.కృష్ణమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు,
బి.ఆర్.నగర్, ఆమదాలవలస మున్సిపాలిటీ

చినుకు పడితే చెరువే

చినుకు పడితే చెరువే