
‘స్పిరిట్ కలపలేదు’
శ్రీకాకుళం క్రైమ్ : సారవకోట మండలం ఆవలంగి గ్రామంలో ఎకై ్సజ్ పోలీసులు గత నెల 3న పట్టుకున్న నకిలీ మద్యం కేసుపై పాతపట్న సీఐ కోటు కృష్ణారావు గురువారం వివరణ ఇచ్చారు. రోడ్డుపై ఖాళీ మద్యం బాటిళ్లు ఏరుకుంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ రోజున 211.90 లీటర్ల నకిలీ మద్యం పట్టుకున్నామని, దుర్గా వైన్‌షాపులో అనధికారికంగా అమ్మకాలు జరుపుతున్న ఐదుగురు ముద్దాయిలను గుర్తించామన్నారు. స్పాట్‌లోనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, షాపు లైసెన్సుదారున్ని అదే నెల 15న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. లేబ్ రిపోర్టు ప్రకారం మద్యంలో ఎటువంటి స్పిరిట్ ఉపయోగించలేదని చెప్పారు. కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతరకు వచ్చే లక్షలాది ప్రజల డిమాండ్ దృష్ట్యా రూ.99బాటిళ్లలోని మద్యాన్ని నీటితో కలిపి రూ.160 మద్యం సీసాలలో నింపుతున్న సమయంలో పట్టుకున్నట్లు వివరించారు. ముద్దాయిలు సకలాభక్తుల నీలకంఠేశ్వరరావు, పిట్ట పైడిరాజు హైకోర్టు నుంచి ఏంటిసిపేటరి బెయిల్ తెచ్చుకున్నారు తప్ప ఈ కేసు నుంచి ఎవరినీ తప్పించలేదన్నారు.
సోంపేట: తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు పట్టుదలతో చదవాలని బిగ్‌బాస్ ఫేం, సినీ నటుడు సొహైల్ అన్నారు. గురువా రం సోంపేటలోని మహర్షి విద్యానికేతన్‌ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ముందుగా కంచిలిలో కంచమ్మ తల్లిని దర్శనం చేసుకున్నారు. అనంతరం సోంపేట మహర్షి విద్యానికేతన్ యాజమాన్యంతో ఉన్న పరిచ యం మేరకు పాఠశాలకు వచ్చి చిన్నారులతో సందడి చేశారు.
శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ ఫలితాల్లో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. డిస్టింక్షన్‌లో 15 మంది, ప్రథమ శ్రేణిలో 43 మంది, ద్వితీయ శ్రేణిలో ఏడుగురు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతీ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.

‘స్పిరిట్ కలపలేదు’