
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
● నాలుగు నెలల కిందటే వివాహం ● దేవునల్తాడలో విషాదఛాయలు
వజ్రపుకొత్తూరు: దేవునల్తాడ గ్రామానికి చెందిన బుడగల్ల చినబాబు(42) సముద్రంలో చేపల వేట కు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తు లు తెలిపిన వివరాల ప్రకా రం.. దేవునల్తాడకు చెందిన బుడగట్ల కేశవులు, గుణసరణమ్మ కుమారుడు చినబాబుకు నాలుగు నెలల క్రితం ఒడిశా రాష్ట్రం పూరీకి చెందిన నారాయణమ్మతో వివాహం జరిగింది. జీవనోపాధిలో భాగంగా గురువారం వేకువజామున తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 8 గంటల సమయంలో వలను లాగే ప్రయత్నంలో అలలు ఎగసిపడటంతో చినబాబు తెప్ప నుంచి జారి పడి మృతి చెందాడు. విషయాన్ని సర్పంచ్ టి.వరదరాజులు, ఎంపీటీసీ సభ్యుడు ఎస్.వెంకన్న, గ్రామ పెద్దలు వజ్రపుకొత్తూరు పోలీసులకు తెలియజేయడంతో సిబ్బంది తీరానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి బుడగట్ల గుణసరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూ రు హెచ్‌సీ కె.ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి