
బైక్ నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం
పాతపట్నం: పెద్దలక్ష్మిపురం పంచాయతీ రామచంద్రపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పాతపట్నం ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండల కేంద్రం రెల్లివీధికి చెందిన అడప ఈశ్వరరావు (36) ద్విచక్ర వాహనంపై తెంబూరు నుంచి సారవకోట వెళుతుండగా రామచంద్రపురం కూడలి వద్ద వచ్చేసరికి అదుపుతప్పి బైక్‌పై నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ మధుసూదనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈశ్వరరావుకు భార్య సుజాత, కుమారుడు యెషన్ ఉన్నారు. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.