
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
● నర్సీపట్నంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ పోటీలు
● కఠోర సాధన చేస్తున్న క్రీడాకారులు
● ఇప్పిలి, కేశవరావుపేట వేదికగా
రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్‌బాల్ గేమ్‌లో పతకమే లక్ష్యంగా బాలబాలికలు కఠోర సాధన పూర్తి చేశారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో సత్తాచాటేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, యూత్, సీనియర్స్ ఇలా అన్ని విభాగాల్లోను హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారుల అభ్యర్ధనను, దసరా సెలవులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘ పెద్దలు శ్రీకాకుళం రూరల్ మండలం, ఇప్పిలి జెడ్పీహెచ్‌స్కూల్ వేదికగా బాలికలకు, ఎచ్చెర్ల మండలం, కేశవరావుపేట జెడ్పీహెచ్‌స్కూల్ వేదికగా బాలురుకు శిక్షణా శిబిరాలను నిర్వహించారు. టైటిల్ సాధనే లక్ష్యంగా క్రీడాకారులకు గేమ్‌లో మెలకువులు అందిస్తు తీర్చిదిద్దారు. గేమ్‌తోపాటు ఫిట్‌నెస్‌పై కూడా దృష్టిసారిస్తున్నారు. సంఘ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఒకటే గమనం.. ఒకటే గమ్యం!