
రోడ్డు ప్రమాదంలో సీమేన్ మృతి
నరసన్నపేట: మండలంలోని జమ్ము కూడలి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాల రవి (35) మృతి చెందారు. విశాఖ నుంచి తాతయ్య ఊరు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే రవి మృతి చెందాడు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న రవి దసరా పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రవికి భార్య భారతి, తలిదండ్రులు నరసయ్య, కామాక్షమ్మ ఉన్నారు. నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో సీమేన్ మృతి