అంతేనా బాసూ! | - | Sakshi
Sakshi News home page

అంతేనా బాసూ!

Sep 30 2025 8:46 AM | Updated on Sep 30 2025 8:46 AM

అంతేన

అంతేనా బాసూ!

69 తులాల బంగారం చోరీకె.మత్స్యలేశంలో భారీ చోరీ జరిగింది. 69 తులాల బంగారం చోరీ చేశారు. –8లో ●

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
69 తులాల బంగారం చోరీకె.మత్స్యలేశంలో భారీ చోరీ జరిగింది. 69 తులాల బంగారం చోరీ చేశారు. –8లో
నేటికీ దొరకని కీలక సూత్రధారి

మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

మద్యం కేసు..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

కిలీ మద్యం కేసు మిగతా కేసుల్లాగానే నీరుగారిపోతున్నట్లు కనిపిస్తోంది. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు ఆయన వేసిన క్వాష్‌ పిటీషన్‌ కోర్టు కొట్టేసింది. ప్రత్యేక బృందాన్ని వేశామని చెబుతున్న ఎకై ్సజ్‌ అధికారులు ఆయనను పట్టుకోలేకపోతున్నారు.

ఈ నెల 2వ తేదీన సారవకోట మండం అవలింగి సమీపంలోని దుర్గా వైన్‌ షాపులో, సమీపంలోని ఇంటిలో నకిలీ మద్యం దొరికింది. షాపులో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన నకిలీ మద్యం బాటిళ్లు దొరకగా, సమీపంలోని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లతో పాటు ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్‌ నెంబర్‌ స్టాంపింగ్‌ మిషన్‌ వంటివి దొరికాయి. ఆ ఇంటిని జిల్లా టీడీపీ కీలక నేత సోదరుడు సన్నిహితుడు మీసాల నీలకంఠం అద్దెకు తీసుకుని, నకిలీ మద్యం బాగోతాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి సరఫరా చేశారో గానీ బుడితిలోని దుర్గా వైన్‌ షాపులో మాత్రం దొరికాయి. అద్దెకు తీసుకున్న ఇంటితో పాటు దుర్గా వైన్‌ షాపులో ఈ నకిలీ మద్యం వ్యవహారం చిన్నదేమీ కాదని సమాచారం. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకొచ్చిన అల్కహాల్‌కు కలర్‌ కలిపి నకిలీ మ ద్యం తయారు చేసి, బాటిలింగ్‌ చేసి విక్రయిస్తున్నట్టుగా సందేహాలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

రిపోర్టు ఊహించిందే..

అవలింగిలో దొరికిన నకిలీ మద్యంలో ప్రమాదకర ఆల్కహాల్‌ కేరామెల్‌ కలిపి ఉండొచ్చని, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకొచ్చి ఉండొచ్చని అధికార వర్గాలు సైతం భావించాయి. కానీ, నకిలీ మద్యం శాంపిల్‌ను విశాఖలోని ల్యాబ్‌కు పంపించగా డై ల్యూట్‌లో ఫ్రైస్‌ లిక్కర్‌ విత్‌ వాటర్‌ అని రిపోర్టు వచ్చిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌చార్జి అసిస్టెంట్‌ క మిషనర్‌ రామచంద్రరావు తెలిపారు. అంటే తక్కు వ ధర వైన్‌లో నీటిని కలిపి ఎక్కువ ధర వైన్‌లో మిక్స్‌ చేసినట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు. అంటే రూ.160 ధర గల వైన్‌లో రూ.99 వైన్‌తో పాటు నీటిని కలిపినట్టు అధికారులు అంచనాకు వచ్చా రు. సాధారణంగా ఎకై ్సజ్‌ శాఖలో ఎక్కడే కల్తీ మ ద్యం దొరికినా, నకిలీ మద్యం పట్టుబడినా ఈ రకమైన రిపోర్టే వస్తుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది. దీంట్లో నిజమెంతో వారికే తెలియాలి. ప్రమాదకరమైన ఆల్కహాల్‌ కలిసినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని ఎకై ్సజ్‌ వర్గాలు తేల్చిపారేశాయి.

తప్పించుకుంటున్నారా?

తప్పిస్తున్నారా?

కీలక సూత్రధారి మీసాల నీలకంఠం దొరకకుండా వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారా? తెరవెనక శక్తులు తప్పిస్తున్నాయా? అన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవంగా నీలకంఠం బాగోతం అంత సులువుగా బయటపడేది కాదు. కానీ, నరసన్నపేట టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు జిల్లా కీలక నేత సోదరుడు నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు స్థానిక నేత నాయకత్వం వహిస్తున్నారు. కీలక నేత సోదరుడు అండ చూసుకుని నీలకంఠం స్థానిక నేతకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. స్థానిక నేతకు నీలకంఠం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు సరికదా తన సిండికేట్‌ వ్యాపారానికి కలిసి రావడం లేదు. ఆ క్రమంలోనే స్థానిక నేత వ్యూహాత్మకంగా నీలకంఠం బాగోతాన్ని బయటపెట్టించేలా పథకం రచించారన్న వాదనలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికారులు పట్టుకోక తప్పలేదని తెలుస్తోంది. టీడీపీలోని సిండికేట్‌ గ్రూపు రాజకీయాలతో నకిలీ మద్యం గుట్టు, నీలకంఠం బాగోతం బయటపడింది. ఇప్పుడా కీలక నేత సోదరుడు తెలివిగా నీలకంఠం తప్పించుకునేలా సహకరిస్తున్నారు. అధికారులకు దొరకకుండా.. అధికార వర్గాలు కూడా సీరియస్‌గా తీసుకోకుండా ఒత్తిడికి గురి చేసి నకిలీ మద్యం కేసును, మీసాల నీలకంఠంను కాపాడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. నీలకంఠంకు కూడా ఎకై ్సజ్‌ శాఖలో మంచి పట్టు, ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడాయనకు కలిసొస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

సాధారణ కేసుగానే..

జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం మద్యంలో అడల్ట్రేషన్‌ జరుగుతోంది. కాస్ట్‌లీ లిక్కర్‌లో చీప్‌ లిక్కర్‌ కలపడం, చీప్‌ లిక్కర్‌లో నీరు కలపడం వంటి సాధారణంగా జరుగుతున్నాయి. ఆ మధ్య టెక్కలిలో ఒక కేసు వెలుగు చూసింది. తర్వాత మసిపూసి మారేడు కాయ చేసేశారు. కల్తీ మద్యం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని లైసెన్సు దుకాణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్‌ దుకాణాల్లో విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా తేడా కొడితే భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు.

నకిలీ మద్యం కేసు నీరు గారినట్టేనా..?

తప్పించుకుని తిరుగుతున్న కీలక సూత్రధారి మీసాల నీలకంఠం

స్పెషల్‌ బృందాలు తిరుగుతున్నా దొరకడం లేదంటున్న ఎకై ్సజ్‌ వర్గాలు

టీడీపీ గ్రూపు రాజకీయాలతో దొరికిన నకిలీ మద్యం

సూత్రధారిని జిల్లా కీలక నేత సోదరుడు తప్పిస్తున్నట్టుగా అనుమానాలు

ఈ నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారి మీసాల నీలకంఠంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడైతే నకిలీ మద్యం పట్టుబడిందో నీలకంఠం పరారైపోయారు. మద్యం బాటిళ్లు దొరికిన దుర్గా వైన్‌ షాపులో పనిచేస్తున్న ఇద్దరు నౌకర్‌ నామాలను, లైసెన్సు షాపు యజమానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత షాపు సీజ్‌ చేశారు. ఇక, నీలకంఠం తీసుకున్న అద్దె ఇంట్లో ఉంటున్న పైడిరాజు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం మాత్రం దొరకడం లేదు. ఈయన కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నీలకంఠం కోర్టులో క్వాష్‌ పిటీషన్‌ వేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

అంతేనా బాసూ! 1
1/2

అంతేనా బాసూ!

అంతేనా బాసూ! 2
2/2

అంతేనా బాసూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement