కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’

Oct 1 2025 11:07 AM | Updated on Oct 1 2025 11:07 AM

కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’

కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’

● కాంట్రాక్టర్ల ఈఎండీలు ఇచ్చేదెప్పుడో..?

● రూ.4 కోట్ల మేర పెండింగ్‌

● గగ్గోలు పెడుతున్న 40 మంది కాంట్రాక్టర్లు

● అధికార పార్టీ అండదండలు ఉంటేనే బిల్లుల చెల్లింపు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): కార్పొరేషన్‌ పరిధిలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఎర్న్‌డ్‌ మనీ డిపాజిట్లు(ఈఎండీ) చెల్లించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లను కలిశామని, వారు హామీ ఇచ్చినా నేటికీ పని జరగలేదని అంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మూడుసార్లు, జూలైలో ఒక్కసారి ఎమ్మెల్యే, కలెక్టర్లతో కాంట్రాక్టర్లకు మీటింగ్‌లు జరిగాయి. అయినా ఫలితం మా త్రం లేదు. ఈఎండీలు అంటే కాంట్రాక్టర్లు ఏదైనా పనులకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నప్పుడు ముందస్తుగా డిపాజిట్‌ కింద 2.5 శాతం డబ్బుల్ని చెక్‌ రూపంలో చెల్లించాలి. పనులు పూర్తయిన తర్వాత నాణ్యతప్రమాణాలు లోపించడం గానీ, పనులు పాడవ్వడం వంటివి జరిగితే డిపాజిట్‌గా కట్టిన డబ్బుల్లో దానికి ఖర్చు చేస్తారు. అ లాంటి పరిస్థితులు కార్పొరేషన్‌ పరిధిలో ఒక్కటి కూడా లేవు. కానీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు.

నిర్లక్ష్యమే కొంప ముంచింది

ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో పదేళ్ల పాటు ఈ–1గా విధు లు నిర్వహించిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్లు చెబుతున్నా రు. డిపాజిట్‌ కింద ఇచ్చిన చెక్కులు, పనుల వివరాలు రికార్డు చేసిన ఎం–బుక్‌లు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వ్యక్తి వెళ్లి కొత్త ఈ–1 వచ్చినా సమస్యను పరిష్కరించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎండీల కోసం తిరిగి తిరిగి రాకపోవడంతో ఇమ్మంది మల్లేసు, కంచరాన బాబురావు అనే కాంట్రాక్టర్లు టెన్షన్‌ తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు.

చేసిన పనుల సంగతేంటి..?

ఈఎండీ బిల్లుల సంగతి అటుంచితే కూటమి వచ్చాక చేసిన పనులకై నా బిల్లులు ఇవ్వడం లేదు. నిధి పోర్టల్‌ని అప్‌డేట్‌ చేస్తున్నామని కూటమి అధికారంలోకి వచ్చాక నెలల తరబడి తాత్సారం చేశారు. ఇప్పుడు ఈ పోర్టల్‌ పనిచేస్తున్నా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. పక్కన విజయనగరంలో పనిచేస్తున్న నిధి పోర్టల్‌ శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఎందుకు పనిచేయడం లేదో తెలియని పరి స్థితి ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం దాదాపు 25 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి 25 ఫైళ్ల కు గాను రూ.8 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

ఆ నలుగురికే బిల్లులు..

కార్పొరేషన్‌ పరిధిలో పనులు ఎంతమంది పనులు చేసినా బిల్లులు మాత్రం ఆ నలుగురికే వస్తున్నా యి. సీ–బిల్లు పేరుతో కమిషనర్‌ కూటమి నాయకుల సిఫార్సులు ఉన్నవారికి బిల్లులు ఇస్తు న్నారు. యోగాంధ్ర వంటి కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వెంటవెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాంటిది శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఉపయోగకరమైన రోడ్లు, కాలువలు, భవణ నిర్మాణాలకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement