
సర్కార్ స్పందించకపోతే
● డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన పీహెచ్‌సీ వైద్యులు
● పూర్తి స్థాయి విధులకు దూరంగా ప్రభుత్వ గ్రామీణ వైద్యులు
అరసవల్లి: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సర్కారుపై ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్యులంతా కలిసి ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ప్రభు త్వ వైద్యం రోగులకు దూరమైంది. తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జిల్లా పీహెచ్‌సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సు ధీర్, ప్రతిష్టాశర్మ, సుమప్రియ, పావని తదితరుల ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 72 పీహెచ్‌సీల పరిధిలో పనిచేస్తున్న సుమారు 125 మంది వైద్యులు మంగళవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. సోమవారం వరకు అవుట్ పేషెంట్ (ఓపి) రోగులకు వైద్య సేవలను నిలిపివేసి, కేవలం ఎమర్జెన్సీ వైద్య సేవలను మాత్రమే అందించిన వైద్యులు.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను బంద్ చేశా రు. ముందస్తుగా ఇచ్చిన సమ్మె నోటీసు ప్రాప్తికి తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పట్టించుకోవడం లేదు..
వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్‌గౌర్ విదేశీ పర్యటనను సాకుగా చూపుతూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ వైద్యులు ఆరోపిస్తున్నారు. మరో ఐఏఎస్ అఽధికారి కృష్ణబాబుకు తాత్కాలిక బాధ్యతలను అప్పగించినా ఇలాంటి ప రిపాలన అంశాలపై కీలక నిర్ణయాలపై ఆదేశాలు ఇవ్వలేరని చెబుతున్నారు.