ప్రజావ్యతిరేక నిర్ణయం
రాజ్యాంగ విరుద్ధం
ఇదేనా గౌరవం..
రాజకీయాలకు అతీతంగా పోరాటం
అభివృద్ధి పేరిట విధ్వంసం
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
కలను కాలరాయడమే..
ఉద్యమమే
నిర్ణయం సరికాదు..
● తక్షణమే ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోవాలి ● అన్ని పార్టీలు, సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు
శ్రీకాకుళం : వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి సర్కారు తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఐక్యంగా పోరాటం సాగించి అణగారిన, బహుజన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల జేఏసీ ఆద్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ నేత తైక్వాండో శ్రీను పర్యవేక్షణలో డాక్టర్ కంఠ వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటాని నివాళులర్పించారు. పాటల తూట ఆతవ ఉదయభాస్కర్ తొలుత ఏమై పోదుమో అంబేద్కర్ లేకుంటే అన్న పాటను పాడి సమావేశాన్ని ప్రారంభించారు.
– రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అణగారిన, బహుజన, మైనార్టీవర్గాలను వైద్య విద్యకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని కోరారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తారని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు, సొంత సామాజికవర్గం వారికి మేలు చేయడంపైనే ఆయన దృష్టి పెడతారని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించే వారు కరువవుతుండడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమన్నారు. గతంలో పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేపట్టేవారని గత కొంత కాలంగా ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చణీయాంశమై మరో పోరుకు నాందికావాలని ఆకాంక్షించారు. రౌండ్ సమావేశంలో తీర్మానించిన అంశాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని నేతలు స్పష్టం చేశారు.
●తైక్వాండో శ్రీను, కంఠ వేణులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జేఏసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా పండుగ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
● రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ యువ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, కళింగ కోమటి సామాజికవర్గ నాయకులు అంధవరపు సూరిబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్‌గోపాల్, దళిత ఆదివాసీ నాయకులు వాబ యోగి, గ్లోబల్ స్కూల్స్ అధినేత ప్రసాదరావు, హ్యూమన్ రైట్ కమిషన్ నాయకులు ఇంజనీర్ మునిశ్రీనివాస్, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ముజీమ్, ఎస్సీ ఎస్టీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాడాన దేవభూషణరావు, రెల్లి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, లయన్ కరణం హారికా ప్రసాద్, లయన్ పొన్నాడ రవికుమార్, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహిబుల్లా ఖాన్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ, రచయిత దుప్పల రవికుమార్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ.రఫీ, ఎస్సీ సెల్ నాయకుడు పొన్నాడ రుషి, కాళింగ సామాజికవర్గ ప్రతినిధి బగాది వెంకటరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, స్వచ్ఛంధ సేవకులు నటుకులు మోహన్, ఇంజినీర్ దుంగ సుధాకర్, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, కళింగ కోమటి సామాజికవర్గ ప్రతినిధి కోణార్క్ శ్రీను, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు టి.కామేశ్వరి, నాయకులు మండవిల్లి రవి తదితరులు ప్రసంగించారు.
చంద్రబాబు చేపట్టే విధానాలన్నీ పేదల వ్యతిరేక విధానాలే. కార్పొరేట్లకు, తన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.
– ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు,
వైఎస్సార్ సీపీ యువనేత
కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. దేశంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదు.
– అంధవరపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు
రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు. ఆయన సొంతంగా రాసుకున్న రాజ్యాంగం దాని ప్రకారమే పాలన సాగిస్తుంటారు.
– కల్లేపల్లి రామ్‌గోపాల్,
సామాజిక న్యాయ పోరాట సమితి
రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. మా అధినాయకత్వానికి పునరాలోచన చేయమని కోరుతాం.
– సవలాపురపు వెంకటరమణ మాదిగ,
టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు
అభివృద్ధి ముసుగులో విధ్వంసం చేయడం కూటమి నాయకులకు పరిపాటి అయింది. ఇటువంటి ప్రజావ్యతిరేక పేదల వ్యతిరేక నిర్ణయాలపై సమష్టిగా పోరాడాలి.
– దుప్పల రవికుమార్,
రచయిత
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చంద్రబాబు తనవారికి లబ్ధి చేకూర్చాలన్నదే కానీ పేదల కోసం ఏ అంశంలోనూ ఆలోచన చేయరు.
– ఎంఏ రఫీ ,
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకుడు
వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం అంటే పేద విద్యార్థి కలను కాలరాయడమే. ఇటువంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో తెలియడం లేదు.
– పట్నాల శ్రీనివాస్,
వస్త్ర వ్యాపారుల సంఘ నేత
వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేయాలని చూస్తే ఉద్యమమే. దీనిపై పునరాలోచన చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా పోరాడుతాం.
– పొన్నాడ రుషి,
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకుడు
వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వైద్య విద్యను ప్రైవేటీకరించాలని యోచించడం తగదు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి.
– జోగినాయుడు,
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు