
కక్ష సాధింపు
● ప్లానింగ్ ప్రకారం
జీతాలు పెట్టకపోవడం దారుణం
దసరా వంటి పండుగ పూట జీతం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా. ఒకే సమయంలో చాలా పనులు చెబుతున్నారు. మాకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. సంబంధం లేని పనులన్నీ చెబుతున్నారు.
– రెల్ల యమున, వార్డు ప్లానింగ్ సెక్రటరీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సచివాలయ ఉద్యోగులపై ఓ ‘ప్లానింగ్’ ప్రకారమే కక్ష సాధింపులు జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇతర ఏ శాఖలోని ఉద్యోగులకూ ఇవ్వనన్ని బాధ్యతలు వీరికే అప్పగిస్తున్నారు. పనులు చేయకపోతే తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ సచివాలయ ఉద్యోగుల్ని పురుగుని చూసినట్లు చూస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘సిగ్గు, లజ్జ లేదా.. పది వేళ్లు నోటికి ఎలా వెళ్తున్నాయి..’ అని రాయలేని భాషలో తిడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ–2 జానకి ప్లానింగ్ సెక్రటరీలను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా పనులు అప్పగిస్తున్నారని, ప్రశ్నిస్తే కక్షసాధింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
దసరా పూట పస్తులే..
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలకు జీతాలు పెట్టవద్దంటూ ఏసీపీ లేఖ రాయడం అందరినీ విస్మయపరుస్తోంది. దసరా వంటి పండుగ వేళ జీతాలు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 నుంచి 3గంటల వరకు వారు ఆందోళనకు దిగడంతో ఉద్రి క్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు గంటల పాటు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, ఏసీపీ, ఉన్నతాధికారులు చర్చించి చివరకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను తాత్కాలికంగా విరమించారు.
వేధింపులు ఇలా..
సచివాలయ ఉద్యోగుల చేత కనీసం 14 నుంచి 15 గంటల పాటు పనిచేయిస్తున్నారు.
ప్రభుత్వ సెలవు రోజుల్లో సైతం పనులు అప్పగిస్తున్నారు.
అదనపు అలవెన్సుల ఊసే లేదు. ఇన్‌చార్జిల పేరుతో ఒక్కొక్కరికి 4 నుంచి 5 సచివాలయాలు అప్పగిస్తున్నారు.
ప్లానింగ్ సెక్రటరీలపై ఏసీపీ కక్ష సాధింపు
ప్రశ్నించే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వైనం
ఎఫ్‌ఏసీ అలవెన్సులు ఇవ్వకుండా ఇష్టానుసారం విధుల అప్పగింత
ఆందోళనకు దిగిన ఉద్యోగులు
శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి 3గంటల వరకు ఉద్రిక్తత

కక్ష సాధింపు

కక్ష సాధింపు