
తవ్వేస్తాం.. దోచేస్తాం
గట్టు నిర్మాణంతో ప్రమాదం
● జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ● యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు
వసప గ్రామంలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద లారీలకు ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యం
కొత్తూరు:
మండలంలోని వసప గ్రామ సమీపంలో బల ద గ్రామం పేరుతో ఇసుక ర్యాంపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారు లు పట్టించుకోవడం లేదు. నదికి వరదలు వచ్చినట్లయితే ఇసుక తవ్వకాలకు ఆటంకం లేకుండా ఉండేందుకు నది మధ్యలో భారీగట్టును నిర్మించారు. దీంతో నదికి వచ్చిన వరద ప్రవాహం మారిపోయే ప్రమాదం ఉంది. నిబంధనల మేరకు నదిలో ఇసుకను కూలీలతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్‌కు లోడు చేయించాలి. అయితే అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రొక్లెయినర్లతో రెండు నుంచి మూడు మీటర్ల లోతులో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విధంగా తవ్వకాలు చేయడం వలన భూగర్భ జాలలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
పేరుకే ఉచితం
ప్రభుత్వం ఉచితంగా ఇసుక అని చెబుతున్నా ఇక్కడ అమలు జరగడం లేదని తెలుస్తోంది. ఉచిత ఇసుక పేరుతో సుమారు 20 టన్నుల ఇసుకను రూ. 15 వేల వరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. అక్రమంగా ఇక్కడ నుంచి విజయనగరం, విశాఖపట్నంతో పాటు పలు పట్టణాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాలపై మైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక లోడుతో ఇసుక లారీలు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నదిలో ఇంతవరకు ఎన్ని క్యూబిక్ మీట ర్ల ఇసుక తరలించారన్న లెక్కలు కూడా తెలియడం లేదు. మరోవైపు రోడ్లు మీద అధికంగా ఇసుక లారీ లు వెళ్తుండడంతో రోడ్లు గోతులమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు లేకుండా నదిలో అడ్డంగా నిర్మించిన గట్టు నదికి పైభాగాన ఉన్నందున్న వరదలు వచ్చినట్లయితే కుంటిభద్ర, సిరుసువాడ, వసప కాల నీ గ్రామాలకు ప్రమాదకరంగా మారుతుంది. నదిలో వరద ఉద్ధృతంగా వచ్చినప్పుడు గట్టు అడ్డంగా ఉన్నందున గ్రామాల్లో వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. అక్రమంగా జరుగుతు న్న ఇసుక తవ్వకాలను అధికారులు నిలుపుదల చేయాలి.
– అగతమూడి నాగేశ్వరరావు, కుంటిభద్ర, కొత్తూరు మండలం

తవ్వేస్తాం.. దోచేస్తాం

తవ్వేస్తాం.. దోచేస్తాం

తవ్వేస్తాం.. దోచేస్తాం