
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలపై ఆ శాఖ ఉద్యోగులు, కార్మికులు నిరసనలకు దిగనున్నారు. ఇదివరకే పలు రకాలుగా శాంతియుత నిరసనలు, ధర్నాలు చేపట్టిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సంయుక్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 నుంచి నిరసన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 14 నుంచి అన్ని విద్యుత్ సర్కిల్ కేంద్రాల వద్ద ఉద్యోగ, కార్మి కులంతా విధులను నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వినియోగదారులకు కలగనున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం, డిస్కం యాజమాన్యాలే బాధ్యత వహిస్తాయని జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
●అక్టోబరు 6న విశాఖపట్టణం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా
●8న ఎస్‌పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాల యం వద్ద ధర్నా
●13న ఛలో విజయవాడ కార్యక్రమం
●14 నుంచి నిరవధిక సమ్మె
●అనంతరం ప్రభుత్వ నిర్ణయాలపై జేఏసీ ప్రతినిధులు స్పందన మేరకు చర్యలు