వ్యవసాయ రుణాల కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన

Sep 27 2025 6:51 AM | Updated on Sep 27 2025 6:51 AM

వ్యవస

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి గంజాయితో వ్యక్తి అరెస్టు ప్రథమ చికిత్సపై శిక్షణ

హిరమండలం : వ్యవసాయ రుణాలు అందించాలని హిరమండలం మండలంలోని 50 గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ మేర కు శుక్రవారం సవర చొర్లంగిలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో డీపట్టా భూములకు బ్యాంకులు ద్వారా రుణాలు అందేవని, భూముల రీ సర్వే తర్వాత 1బీ అడంగల్‌ రాకపోవడంతో రుణాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1బీ ఉంటేనే రుణాలు ఇస్తాం.. రెన్యూవల్‌ చేస్తామ ని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వ్యవసాయ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారెక్‌లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. పలువురి నుంచి బెయిల్‌ పిటీషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్‌ దివాకర్‌నాయు డు, సిబ్బంది పాల్గొన్నారు.

పలాస: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోరీస్‌ అనే వ్యక్తిని గంజాయితో శుక్రవారం అరెస్టు చేసినట్లు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలియజేశారు. పలాస రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫామ్‌లో తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించాడన్నారు. అతని బ్యాగ్‌లో తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో రాయగడలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తూకం వేయగా 14 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

శ్రీకాకళం కల్చరల్‌: స్థానిక రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై ఒక్కరోజు శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు మాట్లాడు తూ ప్రథమ చికిత్స శిక్షణతో ఎంతో ప్రయో జ నం ఉందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.అని త మాట్లాడుతూ ప్రథమ చికిత్స శిక్షణ ప్రతి ఒక్కరికీ ఈ రోజుల్లో అవసరమని, ప్రాణనష్టం తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులకు ధృవపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్‌క్రా స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ రుణాల కోసం  ఆందోళన 
1
1/3

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన

వ్యవసాయ రుణాల కోసం  ఆందోళన 
2
2/3

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన

వ్యవసాయ రుణాల కోసం  ఆందోళన 
3
3/3

వ్యవసాయ రుణాల కోసం ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement