
పుస్తెల తాళ్లు చోరీ
పాతపట్నం: మండలంలోని పాశీగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో ఇంట్లోని నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు మెడల్లో నాలుగు తులాల బంగారం పుస్తెల తాళ్లు చోరీకి గురయ్యాయని ఎస్‌ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట గ్రామానికి చెందిన గంగు రాము, అతని భార్య గంగు లక్ష్మి అలియాస్ మీరమ్మలు గురువారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దొంగ చొరబడి లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారం పుస్తెల తాడును చోరీ చేశాడు. అలాగే చంద్రపే ట గ్రామానికి చెందిన మొర్రి వెంకటరమణ, అతని భార్య మొర్రి పద్మవతిలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనూ మెడలోని రెండు తులాల బంగారం పుస్తలతాడు చోరి జరిగినట్లు తెలిపారు. రెండు చోరీలపై కేసు నమోదు చేశారు.
బంగారం దుకాణంలో చోరి
రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీవిజయదుర్గా బంగారు నగల దుకాణంలో శుక్రవారం మధ్యా హ్నం చోరీ జరిగింది. బంగారు వస్తువులతో పాటు గా వెండి వస్తువులను అపహరించారు. బాధిత దుకాణదారుడు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి కృష్ణ బుడుమూరులో బంగారం దుకాణం నడుపుతున్నాడు. షాపునకు శుక్రవారం మధ్యా హ్నం గుర్తు తెలియని ముగ్గురు మహిళలు నగలు కొనుగోలుకు చేసేందుకు వచ్చారు. యజమానిని మాటల్లో పెట్టి బేరమాడారు. అనంతరం కొనుగో లు చేయకుండానే వెనుదిరిగారు. వారు షాపు విడి చి వెళ్లగా సీసీ పుటేజీ పరిశీలించిన యాజమాని కృష్ణ చోరీ జరిగిందని గుర్తించారు. సుమారు 3 గ్రాముల బంగారం ముక్కు పుడకలు నాలుగు, 480 గ్రాముల 6 జతల వెండి పట్టీలు చోరికి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.