
పోక్సో కేసు నమోదు
కవిటి: మండలంలోని ఆర్.బెలగాం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న అభియోగంపై శావసానపుట్టుగకు చెందిన విశ్వనాథంపై పోక్సో కేసు గురువారం నమోదు చేసినట్లు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ శుక్రవారం తెలిపారు.
ఆమదాలవలస రూరల్: మండలంలోని తొగరాం గ్రామం వద్ద ఇసుక లారీ వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాతూరు ఇసుక ర్యాంపు నుంచి అధిక బరువుతో వచ్చిన లారీ రహదారికి అడ్డంగా ఆగిపోయింది. దీంతో ఇరువైపుల నుంచి వచ్చిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటలపాటు బస్సులు, ఆటోలతో పాటు అనేక భారీ వాహనాలు నిలిచిపోవడంతో అవస్థలు తప్పలేదు.
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ప్రాంతీయ పర్యావరణాధికారి(ఆర్‌ఐఓ)గా రేగ సురేష్‌కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ /సెక్రెటరీ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్‌కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య డీవీఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్‌ఐఓగా పనిచేసిన ప్రగడ దుర్గారావు ఈ నెలతో ఉద్యోగ విరమణ చేయనుండటంతో డీవీఈవో సురేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.