
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినట్లు కోట
బొమ్మాళి పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి గ్రామానికి చెందిన వాన వైకుంఠరావు(65) గురువారం సాయంత్రం సరియాపల్లి గ్రామ సమీపంలో ఉన్న తన పొలం పనికి వెళ్లి తిరిగి నడిచి వస్తుండగా, అదే మార్గంలో కప్పల రమణ అనేవ్యక్తి వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వెంకుటరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.