
గోవులను సంరక్షించాలని పాదయాత్ర
కంచిలి: గోవులను సంరక్షించాలని నినదిస్తూ రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లా జ్యోతిర్యాలీ గ్రామానికి చెందిన రాహుల్ చౌదరి ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా కంచిలి పట్టణానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఇతడిని స్థానిక హిందూ ధార్మిక ప్రతినిధులు ఆహ్వానించి బస ఏర్పాటు చేశారు. తన పాదయాత్రను ఉత్తరాఖండ్‌లో ముగింపు చేయనున్నట్లు రాహుల్ చౌదరి తెలిపారు. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి గోవులను జాతీయ చిహ్నంగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 9,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఇతడిని కంచిలికి చెందిన జగదీష్ పట్నాయక్, ఇప్పిలి ప్రవీణ్, వూనా శ్రీకాంత్, కొత్తకోట విజయబాబు, కొంచాడ కామేష్, హరేరామ భక్తుడు ధర్మ, ఎస్‌ఆర్‌సీపురం పాఠశాల ఉపాధ్యాయుడు ముకుంద తదితరులు కలిసి సంఘీభావం తెలుపుతూ, కొంత ఆర్థిక సాయం అందించారు.