
సమస్యల ఏకరువు
ఫోకస్
● గ్రీవెన్స్‌లో 85 అర్జీల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు స్పష్టంచేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజా, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్‌లతో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. మొత్తం 85 అర్జీలు వచ్చాయి. శుభ్రత పరంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పరిశీలనలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి స్థాయిలో మూడు ప్రదేశాలను ఎంపిక చేసి అక్టోబర్ 2న స్వచ్ఛ అవార్డులు అందజేస్తామన్నారు.
వినతుల్లో కొన్ని..
● వంశధార ప్రాజెక్టు పరిహారం ప్రస్తుత రేటు ప్రకారం చెల్లించాలని ఓవీపేట గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి కోరారు.
● శ్రీముఖలింగంలో కాలువ తీత పనులు అధ్వానంగా ఉన్నాయని ఆలయ అనువంశిక అర్చకుడు నాయుడు గారి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.
● జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న 21 మంది ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలకు గడచిన 23 నెలలుగా జీతాలు విడుదల చేయలేదని, జీతాలివ్వాలని ఉద్యోగులు అనూష, మనీష, సాయి సంతోషి తదితరులు కోరారు.
● శ్రీకాకుళం నగర పరిధిలోని పొన్నాడ బ్రిడ్జిని అనుకొని శ్రీ సాయి శ్రీనివాసనగర్ లేఅవుట్ మధ్య గుండా 45 మీటర్ల రోడ్డు ప్రతిపాదన నిలుపుదల చేయాలని, దీని వల్ల అక్కడి కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఫిర్యాదు చేశారు.
‘విద్యార్థిని ఆదుకోవాలి’
పొందూరు మండలంలోని కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ ఏడాది విద్యార్థి ప్రమాద ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ప్రతినిధులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగినప్పుడు అక్కడి సిబ్బంది ఏం చేస్తున్నారో తెలపాలని కోరా రు. ప్రభుత్వమే విద్యార్థిని చికిత్సకు సాయం అందించాలని, ఎస్‌ఓపై చర్యలు తీసుకోవాలన్నారు.
మాకూ ‘సీ్త్రశక్తి’ ఇవ్వండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్టీసీలో అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకం వల్ల ప్రైవేటు బస్సులు ఎవరూ ఎక్కడం లేదని, తమకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా ప్రైవేటు బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు.
టీడీపీ కార్యకర్తలకే ఎరువులు
పొందూరు మండలంలోని రైతులకు ఎరువులు అందడం లేదని, టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఎరువు లు ఉంచుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తల ఇంటి వద్ద యూరియా ఎరువు టోకెన్లు ఇస్తున్నారని, ఏఓ పూర్తి గా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్య లు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందించి ఏఓతో మాట్లాడారు. తుంగపేట, అచ్చిపోలవలస, బొడ్డేపల్లి, లచ్చయ్యపేట రైతులు కూడా పాల్గొన్నారు.
గ్రీవెన్స్