
కొత్తమ్మ తల్లి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో భక్తులంతా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా పక్కా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి జరగనున్న ఉత్సవాలకు సంబంధించి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. మొట్టమొదటి సారిగా భక్తుల కోసం హెలికాప్టర్ రైడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాగునీరు, వైద్య సదుపాయం, భక్తుల వాహనాలకు అనుకూలమైన పార్కింగ్, ఫైర్ సేఫ్టీ తదితర సదుపాయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయనతో పాటు డ్వామా పీడీ సుధాకర్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సత్యన్నారాయణ, డీఎస్పీ లక్ష్మణరావుతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
25 నుంచి పీహెచ్‌సీ వైద్యుల నిరవధిక సమ్మె
అరసవల్లి: ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం (ఏపీపీహెచ్‌సీడీఏ) ఆధ్వర్యంలో వైద్యులంతా సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించని పక్షంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణ చేపట్టేలా అడుగు లు వేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవా రం కలెక్టర్‌ను పీహెచ్‌సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ ప్రతిష్టాశర్మ (బాతువ), సుమప్రియ (పోలాకి), రమ్య(గార), మౌనిక (లావేరు), మౌనిక (కళింగపట్నం), చాందిని (సింగుపురం) తదితర బృందం కలిసి సమ్మె నోటీసుతో పాటు తమ డిమాండ్లను కలెక్టర్ వద్ద ప్రస్తావించారు. దీంతో మరో కీలక రంగం సమ్మెకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పీహెచ్‌సీ వైద్యులు సమ్మెకు దిగితే జరగనున్న పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైద్యుల సంఘం హెచ్చరిస్తోంది.

కొత్తమ్మ తల్లి ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన